India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకటేశ్-ఆదినారాయణ మధ్య చిన్నపాటి విషయంపై ఘర్షణ జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణను వెంకటేశ్ కిందకు తోసేశాడు. దీంతో ఆదినారాయణ కింద పడి మృతిచెందాడు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పిడుగు పాటుకు గురై భార్య, భర్తలు దాశరథి నాయక్, దేవి బాయి మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిడుగు పడటంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు.

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన గుమ్మగట్ట మండలంలోని కలుగోడులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కలుగోడుకు చెందిన బోయజ్యోతి(26)ని గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తిరిగి రాలేదని భర్త ఈ దారుణానికి వడిగట్టాడు.

గార్లదిన్నె మండలం కలగాసపల్లి క్రాస్ వద్ద హైవేపై ఆదివారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బెంగళూరు నుంచి HYD వెళ్తున్న ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొంది. ప్రమాదంలో 10మంది కూలీలు, బస్సు కండక్టర్ గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కూలీలంతా మహబూబ్ నగర్ వాసులు.

సీఎం చంద్రబాబును కించపరిచే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారని టీడీపీకి చెందిన నాయకుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శెట్టూరుకు చెందిన లక్ష్మణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఉరవకొండ మండలం కౌకుంట్లకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు రవి ఎంపికయ్యారు. శనివారం గుంతకల్లు ఆర్డీవో కార్యాలయ ఏవో నుంచి ఆయన ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శ్రీనివాసుల చొరవతో కమిటీ సభ్యుడిగా ఎంపికైనట్లు తెలిపారు. ఆయన ఎంపికపై తెదేపా నాయకులు రామాంజనేయులు, గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లాలో అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పకడ్బందీగా పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేయాలని సూచించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 37.0 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.

జవహర్ నవోదయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తు గడువును అక్టోబరు 7వ తేదీ వరకు పొడిగించామన్నారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.