Anantapur

News September 28, 2024

7వ తేదీ నుంచి జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా స్కేటింగ్ అదరపు కార్యదర్శి రవి బాల, జిల్లా స్కేటింగ్ కోచ్ నాగేంద్ర పేర్కొన్నారు. చిలమత్తూరు మండలం టేకులోడులో స్కేటింగ్ బోర్డు ఎంపికలు ఉంటాయన్నారు. 8న అనంతపురంలో మా రోలర్ స్కేటింగ్ అకాడమీలో రింక్ పోటీలు, 9న వడియంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 27, 2024

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో ఎస్పీ జగదీశ్‌తో కలిసి రహదారుల భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు గురించి పలు సూచనలు చేశారు. అదే విధంగా పోలీసుల కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

News September 27, 2024

జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

image

ధర్మవరం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన అండర్-14 స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు బత్తలపల్లి విద్యార్థులు ఏక్నాథ్, అవినాశ్, ఆకాశ్ ఏంపికయ్యారు. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని జెడ్పీహెచ్ స్కూల్, ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులు, పీఈటీలు ఆకాంక్షించారు.

News September 27, 2024

అనంతపురం జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం

image

అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో 10 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తిరుపాలుకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News September 27, 2024

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 50వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ సూచించారు.

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

అనంతపురం జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. పెన్న అహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తి కోట, పుట్టపర్తి, ఆలూరు కోన, కసాపురం, జంబు ద్విపా, యోగి వేమన సమాధి, కదిరి నరసింహ స్వామి ఆలయం ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

అనంతపురం జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. పెన్న అహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తి కోట, పుట్టపర్తి, ఆలూరు కోన, కసాపురం, జంబు ద్విపా, యోగి వేమన సమాధి, కదిరి నరసింహ స్వామి ఆలయం ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

ATP: దారుణం.. చెల్లిపై అన్న అత్యాచారం

image

చెల్లెలిపై అన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన పెద్దపప్పూరు మండలంలో జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి ఆ బాలిక ఆలనాపాలన పెదనాన్న కుమారుడు రామాంజనేయులు చూసుకుంటున్నాడు. పాఠశాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారానికి పాల్పడగా విషయం ఉపాధ్యాయులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు.

News September 27, 2024

అనంతపురం మార్కెట్‌లో కిలో టమాటా రూ.46

image

అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.46 పలికింది. నిన్న మార్కెట్‌కు 1650 టన్నులు వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. అందులో సరాసరి కిలో రూ.37, కనిష్ఠంగా రూ.27 పలికినట్లు పేర్కొన్నారు. వరదలతో ఇతర ప్రాంతాల్లో పంట దెబ్బ తినడంతో వారం రోజులుగా ధరలు నిలకడగా ఉన్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 27, 2024

రోడ్ సేఫ్టీ కమిటీతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ చేతన్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, జిల్లా రవాణాధికారి కరుణసాగర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి శిక్ష పడేటట్టు చేయాలన్నారు.