India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని శ్రీ సత్యసాయి కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన వినతులను సంబంధిత శాఖల హెచ్‌వోడీలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలకు పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. అరటి, టమాటా, ఎండు మిరప, పచ్చిమిరప, వరి, పత్తి, మొక్కజొన్న, వేరుసెనగ వంటి పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 920 హెక్టార్లలో రూ.4,07 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. దీనిని ప్రభుత్వానికి పంపుతాయని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమా మహేశ్వరమ్మ తెలిపారు.
అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండల పరిధిలోని కడప రోడ్డులో లారీ, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు తుదిశ్వాస విడిచారు. ఘటనపై తాడిపత్రి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని జిల్లా పరిషత్‌లో ఉన్న డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వలేకపోయారన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అనంతపురం ఎస్పీ జగదీశ్ తాడిపత్రికి చేరుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తాడిపత్రిలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. తాడిపత్రిలో అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం స్థానిక సంస్థలను అభివృద్ధి చేయకుండా నిర్వీర్యం చేసిందని ఆర్థిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 15 ఆర్థిక సంఘం ద్వారా రూ.1,452 కోట్ల నిధులను సీఎం సూచనలు మేరకు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, అర్బన్ పరిధిలో రూ.454 కోట్లు విడుదలయ్యాయని అన్నారు.
దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు అనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో 5 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆర్డీటీ క్రీడా గ్రామంలో రెండు గ్రౌండ్లు ఉన్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారి అతి పెద్ద ఈవెంట్ జరగనుండటంతో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు గ్రామ పొలాల్లో దారుణం చోటు చేసుకుంది. మేకల కాపరి జయమ్మ అనే మహిళను గొంతు బిగించి దుండగులు దారుణ హత్య చేశారు. 20 మేకలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం మేకలు తోలుకొని వెళ్లిన జయమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇవాళ ఉదయం గ్రామ పొలాల్లో శవాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని డీఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తాజా పరిస్థితులను సమీక్షించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల్లో భరోసా కలిగించడంలో దోహదం చేసే బేసిక్ పోలీసింగ్‌ను మెరుగు పరుచుకోవాలన్నారు.
డా.ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల నిమిత్తం కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలు తెలిపారు. అనంతపురంలో ఉన్న డా.ఎన్టీఆర్ వైద్య సేవ కో-ఆర్డినేటర్ కార్యాలయంలో ఫోన్ నెంబర్ 08554 -247266 ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Sorry, no posts matched your criteria.