Anantapur

News April 4, 2024

అనంతపురం జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు

image

అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాకు బదిలీ అయిన ఆయన ఈ సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అన్బురాజన్ బదిలీ అయిన విషయం తెలిసిందే.

News April 4, 2024

50వేల మెజారిటీతో గెలుస్తా: సత్యకుమార్ యాదవ్

image

ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా సాగిన రాక్షస పాలనకు అంతం పలుకుదామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్‌లో తన బహిరంగ సభకు కదలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే.. 50వేల మెజారిటీలో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలు తలుచుకుంటే వైసీపీ పాలన నేలమట్టమవుతుందని చెప్పారు. ధర్మవరంలో వైసీపీ పాలన తొలగి.. ప్రజాపాలన రావాలని సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.

News April 4, 2024

తాడిపత్రి: పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి

image

పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందిన ఘటన తాడిపత్రి మండలంలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీకి చెందిన హుసేన్ మియా పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందారు. అలాగే చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఆదెమ్మ నిన్న పింఛన్ కోసం వెళ్లి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

News April 4, 2024

అనంత: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. కర్నూలు(D) మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.

News April 4, 2024

ధర్మవరంలో వరుసగా మూడుసార్లు గెలిచిన నాయకుడు

image

ధర్మవరం నియోజకవర్గంలో జి.నాగిరెడ్డి ప్రత్యేకస్థానంగా చెప్పవచ్చు. 1983 నుంచి 1989 వరకు వరుసగా మూడుసార్లు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో నియోజకవర్గ చరిత్రలోనే 40421అత్యధిక ఓట్ల మెజార్టీ, 1983లో 30605 రెండవ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ధర్మవరంలో ఈ రికార్డును బద్దలు కొడతారా కామెంట్ చేయండి.

News April 4, 2024

అనంత: కొండలో చిరుత పులి మృతి

image

పెద్దవడుగూరు మండలం భీమునిపల్లి శివారులోని కొండలో బుధవారం ఓ చిరుతపులి మృతి చెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. అనారోగ్యం కారణంగా మృతి చెందిందా..? లేక ఇతర కారణాలవల్ల మృతి చెందిందా..? అనే కోణంలో విచారణ చేపట్టారు.

News April 4, 2024

JNTU సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

అనంత జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకటో సెమిస్టర్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎంఫార్మసీ ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు.

News April 4, 2024

అనంత: నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి

image

పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివ, రాధా దంపతుల కుమారుడు అఖిల్ అనే ఏడాది బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 4, 2024

సోషియల్ మీడియాలో అసభ్య పోస్టులపై నిఘా ఉంచండి: సత్యసాయి ఎస్పీ

image

ఎన్నికలవేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వస్తున్న పోస్టులు పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోస్టులు పెట్టే వారు నిబంధనలకు లోబడి పోస్టు చేసుకోవాలన్నారు.

News April 3, 2024

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు అనిల్ కుమార్ మృతి

image

సత్య సాయిబాబా ప్రసంగ అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్ కుమార్ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శ్రీ సత్య సాయి స్పెషాలిటీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మృతిచెందారు. దాదాపు 40 ఏళ్ల పాటు సత్య సాయిబాబా వద్ద అనువాదకుడిగా ఉన్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.