India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను రేపు సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురు వేద్దామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందామని మంత్రి పేర్కొన్నారు.
‘బుగ్గ నుంచి యాడికి వెళ్లాలంటే నరకయాతనే’ అనే శీర్షకతో ఈనెల 9న Way2News ప్రచురించిన కథనానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్పందించారు. గుంతలమయంగా మారిన రోడ్డును స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో మట్టి వేయించారు. గుంతలను పూడ్చివేయడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు, సమస్య పరిష్కారానికి కృషి చేసిన Way2News యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి అనంత జిల్లాలో 44వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో పారిశ్రామికవాడ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కియా ఇండస్ట్రీయల్ ఏరియా పీఎస్ పరిధిలో 12, పెనుకొండ పీఎస్ పరిధిలో 14.. మొత్తం 26 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.
బెలుగుప్పు మండలంలోని రాగులపాడు పంప్ హౌస్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో రెండు మోటార్లు ఆఫ్ చేశారు. దీంతో జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆదివారం ఇన్ ఫ్లో ఆగినట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.263 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. సోమవారం నుంచి కృష్ణా జలాలను విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
అనంతపురంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న జిల్లా పురావస్తు శాఖ ప్రదర్శనశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. జిల్లా పురావస్తు శాఖ అధికారులు పురావస్తు శాఖలో ఉన్న విషయాల గురించి, చరిత్రకు సంబంధించిన అంశాల గురించి కలెక్టర్‌కు వివరించారు. సుమారు గంటపాటు కలెక్టర్ పురావస్తు శాలలోని అన్ని విభాగాలను పరిశీలించారు.
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రాలలోనూ సంబంధిత అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 38 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు స్థానాలు కేటాయిస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఇన్‌ఛార్జ్ జడ్పీ సీఈఓ ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో అనంతపురం జిల్లాలో 17 మందికి, శ్రీ సత్యసాయి జిల్లాలో 21 మందికి స్థానాలు కేటాయించారు. అయితే ఎన్నికల ముందు పనిచేసిన స్థానాల్లో వారు చేరాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించడానికి టీచర్ల సంఘాలతో ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీలు ఎన్జీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రశ్నించారు. ఈ మేరకు అనంతపురంలో విజయ్ మాట్లాడుతూ.. ఈ సమావేశం అధికారిక సమావేశమా? లేక అనధికారిక సమావేశమా? అనే విషయం ప్రకటించాలని అన్నారు.
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్‌ను పంపాలని సీఎం వారికి సూచించారు.
Sorry, no posts matched your criteria.