India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎస్పీ మురళీకృష్ణ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి ఎస్పీకి వివరించారు. తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటోలు అందించారు. అర్బన్ సీఐ సురేశ్ బాబు ఉన్నారు.
మత స్వేచ్ఛకు విరుద్ధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అన్నారు. ఆయన శనివారం ఉరవకొండ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వన్నూరుస్వామి, ప్రసాద్, మల్లేశ్, చిన్న రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
అప్పుల బాధ తాళలేక పామిడికి చెందిన ఆదినారాయణ అనే ఆటో డ్రైవర్ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తలవాల కాలనీకి చెందిన ఆదినారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే అప్పులు అధికమయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం పుట్టపర్తిలో జరిగిన సమావేశంలో వైఎస్ఆర్‌టీఏ కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జంషీద్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమణారెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శిగా ఇంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
అనంతపురం పోలీస్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ మురళీకృష్ణ శనివారం తనిఖీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహిస్తున్న అన్ని విభాగాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. డయల్ 100, సైబర్ క్రైమ్, తదితర విభాగాలను తనిఖీ చేసి పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం హైదరాబాదులోని జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పల్లె పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ ముచ్చటించినట్లు సమాచారం. కాగా వయసు మీద పడటంతో జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.
టీటీడీ ఛైర్మన్ సహా కీలక పదవుల నియామకంపై కూటమి సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులును ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఉండటంతో సీమ ప్రాంతానికి చెందిన కాల్వకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఉరవకొండ మండలం సమీపంలోని చిన్న ముష్టురు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి తుఫాన్ వాహనంలో ఉరవకొండకు వస్తుండగా దేవి అనే మహిళ తన కుడి చేయి బయటపెట్టింది. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం తుఫాను వాహనానికి అనుకోని వెళ్లే క్రమంలో ఆమె చేయిని బలంగా తాకింది. దీంతో సగం వరకు చేయి తెగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో నిర్వహించే పరేడ్‌లో పాల్గొనే అవకాశం గుంతకల్లులోని ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి కె.సంజీవరాయుడికి దక్కింది. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంజీవరాయుడు NSS విభాగం తరఫున పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, అధ్యాపకులు అభినందించారు.
ఉరవకొండ పట్టణంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉంటున్న రఫిక్ (22) అనే ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పుల బాధతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.