India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటామని, ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. ఏది ఏమైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలిపారు.

తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఎండోమెంట్ అధికారులు నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి వన్నూరు స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు వచ్చిన హుండీని ఆలయ అర్చకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో లెక్కించారు. రూ.27,24,184ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

విజయవాడలో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణం సీఎం చంద్రబాబే అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుడమేరు కాలువకు అధిక మొత్తంలో వరద రాబోతోందని అధికారులు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు మునిగాయన్నారు.

పుట్లూరు మండలం గాండ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని పావని(19) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పావని కోయంబత్తూర్‌లో బీటెక్ సెకండియర్ చదువుతోంది. వినాయక పండగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లిలో లక్ష్మీనారాయణ అనే రైతు అప్పుల బాధ తాళలేక బుధవారం సాయంత్రం పొలంలో ఊజీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు లక్ష్మీనారాయణ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ధర్మవరంలోని ప్రియాంక నగర్‌కు చెందిన వ్యాపారి రజనీ బాబు(50) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రజనీ బాబు భార్య రామాంజనమ్మ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజనీబాబు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. రజనీబాబు కుమారుడు నిశాంత్ ఏడాది కిందట మృతిచెందాడు. కొడుకు మృతి జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

మడకశిర మండలం గుండుమలలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏడుగురు యువకులు కత్తి, నాటు తుపాకీ చేత పట్టుకుని నృత్యాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రాజు కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి తల్వార్ (కత్తి), నాటు తుపాకీ (రివాల్వర్)ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఉమ్మడి అనంత జిల్లాలో సత్యసాయి తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 536 మంది కార్మికులకు ఫిబ్రవరి నుంచి వేతనాలు నిలిచిపోయాయి. దీంతో 21 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. స్పందించిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వేతనాల కోసం రూ.30 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు.
Sorry, no posts matched your criteria.