Anantapur

News March 28, 2024

పేరూరు చెరువుకు నీరిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

image

రాప్తాడు నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూ మాఫియాలతో కుతకుతలాడిపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాప్తాడు సభలో ఆయన మాట్లాడుతూ.. పేరూరు చెరువుకు నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో రైతులకు న్యాయం చేస్తామన్నారు.

News March 28, 2024

రాప్తాడు: రాయలసీమ ద్రోహి జగన్: చంద్రబాబు

image

రాయలసీమ ద్రోహి సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాప్తాడులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను సీమకు నీళ్లు తెస్తే.. సీఎం జగన్ రాజకీయ హింస తెచ్చాడు అని విమర్శించారు.

News March 28, 2024

అనంతపురం: పదో తరగతి బాలిక ఆత్మహత్య

image

కడుపు నొప్పి తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉన్న తిరుపాలు, లలిత దంపతుల కుమార్తె సుజనా పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఆర్డీటీ ఆసుపత్రిలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

News March 28, 2024

ధర్మవరంలో ఊపందుకోనున్న ప్రచారం

image

ఎట్టకేలకు ధర్మవరం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి దక్కడంతో ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వైసీపీ నుంచి కేతిరెడ్డి పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ కీలక నేత వై.సత్యకుమార్ బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సత్యకు.. వరదాపురం సూరి, పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం బీజేపీకి ఇక్కడ కలిసొచ్చే అంశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

News March 28, 2024

అనంత: నేడు చంద్రబాబు పర్యటన వివరాలు

image

అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.55 మదనపల్లి నుంచి హెలికాప్టర్‌లో 10.40 ప్రసన్నాయ పల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి 11 నుంచి12.30 వరకు రాప్తాడు బహిరంగసభలో పాల్గొంటారు. 2 గంటల వరకు ఆర్డీటీ స్టేడియంలో భోజన విరామం. 2.30 నుంచి 4 వరకు బుక్కరాయసముద్రం మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడనుంచి కదిరికి 5.10 చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.

News March 28, 2024

అనంత : ‘ నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వేటు’

image

రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన ఒప్పంద ఉద్యోగులు విజయకుమార్, సూర్యనారాయణరెడ్డి, తిరుపాల్ రెడ్డి, శింగనమల(M) వెస్ట్ నరసాపురానికి చెందిన క్షేత్ర సహాయకుడు అంజన్ రెడ్డి ఉన్నారు. వీరితో కలిపితే ఇప్పటి దాకా 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్ డీలర్లు, 11 మంది ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు.

News March 28, 2024

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఎం. గౌతమి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అన్నారు.

News March 27, 2024

అనంత: అంజలి మృతి ఘటనలో ముగ్గురు అరెస్ట్

image

అనంతపురం పట్టణానికి చెందిన అంజలి మృతిపై ముగ్గురిని అరెస్టు చేసినట్టు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బెల్దరి దస్తగిరి, బాలును అరెస్టు చేశామన్నారు. మృతురాలి కుటుంబీకులు వాంగ్మూలం ప్రకారం భర్తతో పాటు మరో ఇద్దరిపై విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు.

News March 27, 2024

DHARMAVARAM: ఎవరీ సత్యకుమార్..!

image

ధర్మవరం బీజేపీ MLA అభ్యర్థిగా ఖరారైన వై.సత్యకుమార్.. రాయలసీమలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. బళ్లారి, మదనపల్లె, బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీవైపు అడుగులు వేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ABVPలో కీలకంగా వ్యవహరించారు. 6 భాషలు మాట్లాడే సత్య.. BJP జాతీయ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. అప్పట్లో అధ్వానీ రథయాత్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

News March 27, 2024

మోదీ సన్నిహితుడికే ధర్మవరం MLA టికెట్

image

BJP ధర్మవరం MLA అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ సెక్రటరీ సత్యకుమార్ పోటీ చేయనున్నారు. 34 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. మోదీ, అమిత్‌షాకు సన్నిహితుడిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకునిగా పని చేసి BJPని గెలిపించారు. ఇలా అన్ని విధాల పేరు ప్రఖ్యాతలు ఉన్న సత్యకుమార్ గెలిస్తే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు.