India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరానికి చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ నాగరాజును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ శాలువా కప్పి సన్మానించారు. బుధవారం పుట్టపర్తిలో జాతీయ చేనేత దినోత్సవ సభలో కలెక్టర్ డిజైనర్ నాగరాజును అభినందించి మరిన్ని కళాత్మక ఖండాలను పట్టుచీరలపై తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ ఏడీ రమేశ్ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ మురళీకృష్ణ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, అధికారులు హాజరయ్యారు. వారు మాట్లడుతూ.. పెండింగ్ లోఉన్న కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కృష్టప్ప అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తీసుకువస్తూ పట్టుబడ్డారు. అప్పటి గోరంట్ల సీఐ జయనాయక్ బెంగళూరు విస్కీ 48 టెట్రా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎస్సై సుబ్బరాయుడు, కానిస్టేబుల్ కరుణాకర్ పెనుకొండ కోర్టులో ప్రవేశపెట్టగా వాదనలు విన్న కోర్టు రూ.2 లక్షలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.
స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు.
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వంలో అరుదైన అవకాశం లభించింది. కేంద్రంలోని ఓబీసీ కమిటీలో సభ్యుడిగా, నలుగురు సభ్యులు ఉండే సెంట్రల్ సిల్క్ బోర్డులో సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దక్షిణాది రాష్ట్రాల నుండి అంబికా లక్ష్మీనారాయణ ఒక్కడికే ఈ అవకాశం లభించింది. దీంతో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది
ఉరవకొండ : మండలంలోని నెరిమెట్ల గ్రామానికి చెందిన హనుమంతు అనే రైతు ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిఎల్ఎస్ఏగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్ 2 ఓసి మహిళలకు కేటాయించామన్నారు. అటెండర్ పోస్టులు జనరల్ 1, ఓసి మహిళకు 1 చొప్పున పరుగు సేవల కింద కేటాయించామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రానున్న ఐదు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 34.8° ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు 24.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. పంటలు సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు.. కల్లూరు హైవే పక్కన ఆగి ఉన్న ఆటోను టమోటా లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో కేశవపురం గ్రామానికి చెందిన శివ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలోని మరో ఇద్దరు టీ తాగేందుకు వెళ్లగా ప్రాణాలతో బయట పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్‌ను పొందేందుకు అనంతపురం కలెక్టరేట్ ముస్తాబవుతోంది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌ను హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం సందర్శించింది. గ్లోబల్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్ సర్వీసెస్ సంస్థకు చెందిన లీడ్ ఆడిటర్, కేఎస్ఎన్ ప్రసాద్, ఆడిటర్ రాజేశ్, కో-ఆడిటర్ సింగయ్య బృందం కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు.
Sorry, no posts matched your criteria.