Anantapur

News August 1, 2024

అనంతపురం జిల్లాకు రూ.250 కోట్లు!

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.250 కోట్లు రానున్నాయి. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించనున్నారు.

News July 31, 2024

అనంతపురం జిల్లాకు రూ.250 కోట్లు!

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.250 కోట్లు రానున్నాయి. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించనున్నారు.

News July 31, 2024

పెనుకొండ: టమాటా లోడు వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు దుర్మరణం

image

పెనుకొండ మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం పెనుకొండ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి టమాటా లోడుతో వెళుతున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో టమాటా వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ టమాటా లోడుతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News July 31, 2024

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై సమీక్ష

image

ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గంటల నుంచే NTR భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి NTR భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీపై DRDA PD, DPO, RDO, ఎల్డీఎం, బ్యాంక్ అధికారులు, MODO, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు

News July 31, 2024

బాల్యవివాహాల నిరోధానికి ప్రత్యేక చర్యలు: ఐసీడీఎస్ పీడీ

image

బాల్యవివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు ఉన్నా అవగాహన లేకపోవడం వల్లే అవి నేటికీ కొనసాగుతున్నాయని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి అన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై రాయదుర్గం కేజీబీవీలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్యవివాహాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎంపీడీఓ అల్లాబకాశ్, ఎంఈవో నాగమణి, సీడీపీఓ ప్రభావతమ్మ, ఎస్ఓ వెంకట లక్ష్మీ, డీటీ రఘు పాల్గొన్నారు.

News July 31, 2024

నేటి నుంచి టెన్త్, ఇంటర్ ఓపెన్ అడ్మిషన్లు ప్రారంభం

image

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్‌కు సంబంధించి 2024-25 ఏడాదికి బుధవారం నుంచి అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు అనంతపురం డీఈఓ వరలక్ష్మీ, ఏసీ గోవింద్ నాయక్ మంగళవారం తెలిపారు. అడ్మిషన్‌లకు ఆగష్టు 27వ తేదీ చివరి గడవు అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://apopenschool.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.

News July 31, 2024

అనంత: రానున్న 5 రోజుల్లో చిరుజల్లులు

image

రానున్న 5 రోజుల్లో అంనతపురం జిల్లాలో చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా సంస్థ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్ బాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 33.8-34.6, రాత్రి ఉష్ణోగ్రతలు 24.2-24.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చన్నారు.

News July 31, 2024

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ఉరవకొండ మండల కేంద్రంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగదిని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు, పాఠాలు ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

News July 30, 2024

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కీలక బాధ్యతలు?

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీలో కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే పలు జిల్లాలకు అధ్యక్షులను మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎం.శంకరనారాయణకు పార్టీలో మరో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News July 30, 2024

సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 1న మడకశిర మండలం గుండుమల గ్రామానికి రానున్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంట నుంచి హెలికాప్టర్‌లో మ.12.20 గంటలకు పయనమై మ.1.45 గంటలకు గుండుమలకు చేరుకుంటారు. మ.2.20 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం కావేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. సా.4.55 గంటలకు పుట్టపర్తికి చేరుకుని ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్తారు.