India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అనంతపురం బాలుడిని అరెస్ట్ చేశామని సీఐ రామకృష్ణ తెలిపారు. అనంతపురం పట్టణానికి చెందిన పదహారేళ్ల బాలుడు 4.9 కిలోల గంజాయి తరలిస్తుండగా తుని రైల్వే పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం పట్టుకున్నామన్నారు. ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మంగళవారం బాలుడిని కోర్టులో హాజరపరుస్తామన్నారు.
అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫలితాలలో 98.46 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఎస్కేయూ ఇన్‌ఛార్జ్ వీసీ అనిత తెలిపారు. మొత్తం 324మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 319మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
పెనుకొండ సమీపంలో జరిగి<<13726628>> ఆర్టీసీ బస్సు- లారీ ఢీ<<>> కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రెండు గంటలు బస్సుల్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు క్రేన్ సహాయంలో అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు విరగడంతో ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురానికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గార్లదిన్నె మండలం కల్లూరు సచివాలయం మహిళా కానిస్టేబుల్ షేక్ రజియా బేగంను అభినందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించడంలో మంచి ప్రతిభ చూపించారని తెలిపారు. అందరూ అదే స్ఫూర్తితో పని చేసి బాల్య వివాహాలు నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం హత్య ఘటనలో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు చెప్పింది. అనంతపురం టౌన్‌కు చెందిన భీమేశ్ మరో ముగ్గురు స్నేహితులు. చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఓ చోరీ కేసులో భీమేశ్ మిగతా ముగ్గురి పేర్లు చెప్పారు. వారు భీమేశ్‌పై పగ పెంచుకుని రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో నిందితులు ముగ్గురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించారు.
జేసీ కుటుంబ సభ్యులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు. ఇంటికి చేరుకున్న మంత్రికి జేసీ పవన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డితో పలు అంశాలపై చర్చించారు. పవన్‌కు కీలక నామినేటెడ్ పోస్ట్ దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కలవడం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ విజయమ్మను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లా. అక్కడ విజయమ్మ కనిపించారు. ఆమె బాగోగులపై పలకరించి మాట్లాడా. ఈ కలయికలో ఎలాంటి రాజకీయం లేదు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి ట్వీట్ చేశారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పాప మిస్సింగ్ వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. వార్డులో రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు స్టాఫ్ నర్సులు శ్రవణమ్మ, సువర్ణమ్మలను సస్పెండ్ చేశారు. ఎఫ్ఎన్‌ఓ సుజాత, మహిళా సెక్యూరిటీ గార్డు సునీతను విధుల నుంచి తొలగించినట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు.
కూడేరులోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చిరుత మృతదేహం లభ్యమైంది. గొర్రెల కాపర్లు గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. చిరుత చనిపోయి నాలుగు నుంచి ఐదు రోజులు గడిచినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతను ఎవరైనా చంపారా లేదా అనారోగ్యంతో చనిపోయిందా అనే కోణంలో విచారిస్తున్నారు.
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన యాడికి మండలంలో జరిగింది. లక్షుంపల్లికి చెందిన చంద్ర, దాసరి బలరాముడు అన్నదమ్ములు. ఈనెల 26న బలరాముడు గుండెపోటుతో మృతిచెందాడు. తమ్ముడి అంత్యక్రియలకు వెళ్లిన అన్న ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఆదివారం ఉదయం తోటకు వెళ్లగా చెట్టుకు ఉరివేసుకుని ఉన్న చంద్ర కనిపించాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.