Anantapur

News July 29, 2024

మడకశిర: సీఎం పర్యటనలో కట్టుదిట్టమైన భద్రత

image

మడకశిర నియోజకవర్గంలో ఆగస్టు 1న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని గుండుమలలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంతంతో పాటు హెలిప్యాడ్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News July 28, 2024

నారా లోకేశ్‌కు అభినందనలు: మంత్రి సత్యకుమార్

image

ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టిన నారా లోకేశ్‌కు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలిపారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్​ కలాం పేర్లను పథకాలకు పెట్టడం వారిని గౌరవించడమే. ప్రతి పథకానికి తన, కుటుంబ పేర్లు పెట్టుకుని స్వలాభం కోసం వాడుకున్న గత పాలకుడిలా కాకుండా సమాజానికి మేలు చేసిన వారి పేర్లు కలకాలం గుర్తుండిపోయేలా లోకేశ్ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం’ అని ట్వీట్ చేశారు.

News July 28, 2024

అనంత: ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 50శాతం మార్కులు, మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, తత్సమాన విద్యార్హతలు కలిగిన యువతీ, యువకులు అర్హులన్నారు. http-s://agnipathvayucdac.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 28, 2024

అసత్య ప్రచారం మానుకోవాలి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

శింగనమల నియోజకవర్గంలో తన గెలుపునకు సహకరించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. తన ఫ్యామిలీపై కొందరు మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుని పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలను ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరించారు.

News July 28, 2024

ఉరవకొండ మండలానికి చేరుకున్న తుంగభద్ర

image

ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామం వద్ద ఉన్న తుంగభద్ర ఎగువ కాలువలోని 189కిలోమీటర్ వద్ద ఉన్న మోపిడి లింక్ ఛానల్ వద్ద ఉన్న పీఏబీఆర్ కాలువకు శనివారం సాయంత్రం తుంగభద్ర జలాలు చేరుకున్నాయని హెచ్ఎల్‌సీ జె.ఈ అల్తాఫ్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర ఎగువ కాలువకు బోర్డు అధికారులు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

News July 27, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ఆగష్టు 1న మడకశిరకు సీఎం చంద్రబాబు రాక
☞ శ్రీసత్యసాయి జిల్లాలో 26 మంది తహశీల్దార్‌లకు రిలీవ్ ఆదేశాలు జారీ
☞మడకశిరలో విద్యుత్ తీగపడి వ్యక్తి మృతి
☞మై గవర్నమెంట్ అంబాసిడర్ అవార్డు అందుకున్న బిసాతి భరత్
☞ ఓడీసీ మండలంలో అంగన్వాడీ ఆత్మహత్యాయత్నం
☞ తుంగభద్ర డ్యాం 32 గేట్లు ఎత్తివేత
☞ కుందుర్పి ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్
☞ధర్మవరం హౌసింగ్ ఏఈ అన్నం బాలాజీ ఆత్మహత్యాయత్నం

News July 27, 2024

కళ్యాణదుర్గం: ఈ బాలుడిని తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లాలి

image

కల్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తరుణ్ అనే బాలుడు శనివారం ఒంటరిగా ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఒంటరిగా ఉన్న బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరైనా బాలుడిని గుర్తిస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు గుర్తిస్తే పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లవచ్చునని తెలిపారు.

News July 27, 2024

జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీసత్యసాయి జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలకు దరఖాస్తులు చేసుకోవాలని శనివారం జిల్లా విద్య అధికారి మీనాక్షి తెలిపారు. ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ మున్సిపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అర్హులన్నారు. రెండేళ్లలోపు రిటైర్డ్ అయ్యేవారు, పూర్వం ఎస్‌జీఎఫ్‌గా పనిచేసిన వారు, సర్వీసులు ఏవైనా అనర్హతకు గురైన వారు ఈ పోస్టులకు అనర్హులన్నారు.

News July 27, 2024

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈఓ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 5వ తేదీ లోపు మండల విద్యాధికారికి అందజేయాలన్నారు.

News July 27, 2024

వచ్చే నెల 1న మడకశిరకు సీఎం చంద్రబాబు రాక

image

ఆగస్టు ఒకటో తేదీ సీఎం చంద్రబాబు మడకశిరకు రానున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం. సీఎం రాకను పురస్కరించుకొని జిల్లాస్థాయి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.