Anantapur

News July 27, 2024

పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి: అనంత కలెక్టర్

image

పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 49వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, DIEPC) సమావేశం నిర్వహించారు.

News July 26, 2024

ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా

image

అనంతపురం కోర్ట్ రోడ్డులోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా అధికారి ఏ.కళ్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్‌లో 40ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తి, అర్హతగల యువతీ యువకులు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News July 26, 2024

కార్గిల్ యుద్ధవీరుల త్యాగం అసామాన్యం..అందరికీ స్ఫూర్తి దాయకం

image

కార్గిల్ యుద్ధవీరుల త్యాగం, ధైర్య సాహసాలు అసామాన్యమని సమాజంలో అందరికీ స్ఫూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం సందర్భంగా రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ అధ్వర్యంలో శుక్రవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కార్గిల్ యుద్ధ వీరులకు, మాజీ సైనికులకు కార్గిల్ విజయ్ దివస్ మెమెంటో, పుష్ప గుచ్ఛాలతో జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు.

News July 26, 2024

ఆదర్శంగా ఉంటూ పోలీసులు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్పీ

image

అందరికీ ఆదర్శంగా ఉంటూ పోలీసులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ సాయిధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మరింత నిబద్ధత, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆగస్టు 17 నాటికి మరింత మెరుగుపరచుకోవాలన్నారు. సమాజంలో అందరికీ జవాబుదారిగా ఉండాలన్నారు.

News July 26, 2024

స్వపక్షంలోనే విపక్షం: అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్

image

స్వపక్షంలోనే విపక్షం తయారైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని వైద్య, ఆరోగ్య సమస్యలు చెప్పారు. అది మంచిదే. ప్రజారోగ్యం గురించి ఆలోచించి వారి నియోజకవర్గాల్లోని సమస్యలు చెప్తున్నారు. అధ్యక్షా.. గత ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో అవినీతికి పాల్పడింది. నియామకాల్లో రాజకీయ జోక్యంతో అవకతవకలకు పాల్పడింది’ అని అన్నారు.

News July 26, 2024

సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొద్దాం: ఎస్పీ

image

సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. అనంతపురంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఏఆర్ సాయుధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడాతూ.. పరేడ్ బాగా చేశారన్నారు. యూనిఫాం సర్వీస్‌లో ఏఆర్, హోంగార్డులు, సివిల్ పోలీసులతో పాటు ప్రాధాన్యతగా సేవలు అందిస్తున్నారన్నారు.

News July 26, 2024

శ్రీ సత్యసాయి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

ధర్మవరం మండలం ఎర్రగుంటకు చెందిన ముంతాజ్ బేగం(48) గురువారం వాటర్ హీటర్ తగిలి మృతిచెందారు. స్నానం చేయడానికి బకెట్‌లో నీళ్లు పోసి హీటర్ వేశారు. నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నించగా కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఆమెకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముంతాజ్ బేగం భర్త మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నారు.

News July 26, 2024

28వ తేదీ నుంచి షూటింగ్ బాల్ జట్ల ఎంపిక

image

అనంతపురం జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం అనంతపురం పట్టణం సెయింట్ జోసెఫ్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి అమరేంద్ర యాదవ్ తెలిపారు. 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.

News July 26, 2024

విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన కలెక్టర్

image

అనంతపురంలోని నాలుగవ రోడ్డులో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పుస్తకాలు, మొక్కలు పంపిణి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవల పట్ల అవగాహన ఉండాలని, నలుగురికి సహాయం చేసే వ్యక్తిత్వం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

News July 25, 2024

మాతృ మరణాలు అరికట్టాలి: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లాస్థాయి మాతా శిశు మరణాల సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు జరిగిన 17 మాతృ మరణాలలో 6 కేసులను సమీక్ష చేశారు. జిల్లాలో జరిగిన మాతృ మరణాలకు గల కారణాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వివరించారు. మాతృమరణాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.