Anantapur

News March 17, 2024

అనుమతి లేని రాజకీయ ప్రకటనలను వెంటనే తొలగించండి: కలెక్టర్

image

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలుపరచాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 17, 2024

నార్పల: పొలం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 

image

నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో శనివారం రాత్రి పొలం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బైక్‌కు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష..

image

ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి, కదిరి ఆర్డిఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News March 17, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థి బయోడేటా

image

హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా జోలదరాశి శాంతను ప్రకటించింది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆమె ఇంటర్ మీడియట్ వరకు చదువుకుంది. 2009 నుంచి 2014 వరకు బీజేపీ తరపున బళ్లారి పార్లమెంట్ సభ్యురాలిగా పని చేశారు. ఆమె సోదరుడు శ్రీరాములుకు కూడా గతంలో కర్ణాటక మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. రాజకీయ సమీకరణాలలో వైసీపీ ఆమెకు టికెట్ కేటాయించింది.

News March 17, 2024

10వ తరగతి విద్యార్థులకు ALL.THE.BEST: కలెక్టర్ గౌతమీ

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి జరగనున్న పరీక్షలకు 40,063 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయాలని సూచిస్తూ.. ALL.THE.BEST. అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

News March 17, 2024

జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ రూమ్ ఏర్పాటు చేశామని తక్షణమే దాని సేవలు అందుబాటులోకి వస్తాయని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం సమాయత్తంగా ఉందని పేర్కొన్నారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్సీసీ బృందాలు ఉన్నాయని పేర్కొన్నారు.

News March 17, 2024

అనంత: రేపు కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి జరగబోయే స్పందన కార్యక్రమం తేదీని ప్రకటిస్తామన్నారు. ఇందుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.

News March 17, 2024

జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులకు గ్రూప్-1 పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.

News March 17, 2024

శింగనమల: మాజీ ఎంపీపీ ఉమాపతి నాయుడు టీడీపీకి రాజీనామా

image

తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపాటి ఉమాపతి నాయుడు తెలిపారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గం టీడీపీలో మితిమీరిన గ్రూపు తగాదాల కారణంగా పార్టీలో పనిచేయ లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెబుతున్నా.. ఇక్కడ నాయకులు విస్మరిస్తున్నారన్నారు.

News March 17, 2024

ఎన్నికలలో పోలీసులు చేయాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ: డీఎస్పీలు

image

త్వరలో జరగనున్న ఎన్నికల విధివిధానాల, విధుల పట్ల పోలీస్ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీలు శ్రీలత, శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం కదిరి సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులకు ఎన్నికల విధులపై కదిరిలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్షన్ సెల్ పోలీస్ సిబ్బందికి త్వరలో జరగనున్న ఎన్నికలలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించారు.