Anantapur

News July 24, 2024

బొమ్మనహల్: తుంగభద్ర జలాలను స్వాగతం పలికిన రైతులు

image

ఆంధ్ర సరిహద్దుకు చేరుకున్న తుంగభద్ర జలాలను రైతులు ఘనంగా స్వాగతించారు. సోమవారం ఉదయం ఎగువ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆంధ్ర సరిహద్దులోని 105 కిలోమీటర్ల వద్దకు చేరుకున్నాయి. దీంతో హెచ్ఎల్సీ అధికారులు జలాలను స్వాగతిస్తూ పూజలు నిర్వహించారు. రైతులు తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దుకు చేరుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.

News July 23, 2024

ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న తుంగభద్ర జలాలు

image

తుంగభద్ర జలాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నాయి. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం ఆంధ్ర సరిహద్దుకు 105వ కిలోమీటర్ వద్దకు తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. తుంగభద్ర హై లెవెల్ కెనాల్‌లో తుంగభద్ర జలాలను చూసిన రైతులు ఎంతో సంతోషపడ్డారు. తుంగభద్ర జలాలు ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకోవడం సంతోషదాయకంగా ఉందని అన్నారు.

News July 23, 2024

శ్రీసత్యసాయి: రైలు కిందపడి యువకుడి మృతి

image

ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఓ యువకుడి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News July 23, 2024

ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సత్యసాయి కలెక్టర్ సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇసుక పంపిణీపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా మైండ్స్ జియాలజీ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

News July 23, 2024

గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

image

సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఆదినారాయణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం ఆయన ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనిలో నిమగ్నమైన ఆయన ఆకస్మికంగా కిందపడ్డారు. అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటన పెద్దన్నవారిపల్లిలో విషాదం నింపింది.

News July 23, 2024

రాజధానికి రూ.15 వేల కోట్లు.. మంత్రి సత్యకుమార్ ట్వీట్

image

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఏపీ ​ప్రజల కలల రాజధాని నిర్మాణం కోసం స్పెషల్​ సపోర్ట్​కింద కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాదికి గానూ రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి ట్వీట్ చేశారు.

News July 23, 2024

అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ల తయారీ సంస్థ రాబోతుందా?

image

భారత్‌లో H125 హెలికాప్టర్ల కోసం ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌బస్‌ 8 ప్రదేశాలను ఎంపిక చేసింది. 2015-16 మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్ల మం. పాలసముద్రం దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. 250 ఎకరాలు కేటాయించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పుడు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు కోసం ఎయిర్‌బస్ 8 ప్రాంతాలను ఎంపిక చేయటంతో అందులో అనంతపురం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

News July 23, 2024

అనంతపురంలో 2, సత్యసాయి జిల్లాలో ఒక హత్య: ఏపీ పోలీస్

image

కూటమి ప్రభుత్వంలో 40 రోజుల్లో 31 మందిని రాజకీయంగా హత్య చేశారని వైసీపీ చేసిన ట్వీట్‌ను పోలీసులు ఖండించారు. జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో 4 హత్యలు జరిగాయని తెలిపారు. అందులో అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కో హత్య జరిగిందని చెప్పారు. మృతుల్లో ముగ్గురు టీడీపీ, ఒకరు వైసీపీ అని తెలిపారు. పాత కక్షలు, రాజకీయ విభేదాలతో శ్రీసత్యసాయి జిల్లాలో ఒక హత్య జరిగిందని వివరించారు.

News July 23, 2024

అనంతపురం జెడ్పీ ఛైర్‌పర్సన్ గన్‌మెన్ల తొలగింపు

image

అనంతపురం జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మకు రాష్ట్ర ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. గత ప్రభుత్వం ఆమెకు 1+ 1 గన్‌మెన్లను కేటాయించింది. తాజాగా ఉన్నతాధికారులు గన్‌మెన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారు బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.

News July 23, 2024

పెనుకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

పెనుకొండ మండలం మునిమడుగుకి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో సోమవారం రాత్రి మృతి చెందారు. మునిమడుగు చెందిన అశోక్, నరేంద్ర బైక్‌లో గుట్టూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుతున్నారు. బైకు అదుపుతప్పడంతో అశోక్ అక్కడిక్కడే చనిపోయారు. నరేంద్రను పెనుకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై కియా ఎస్ఐ రంగడు పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి మృతదేహాలను పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.