Anantapur

News July 23, 2024

అక్రమ మద్యం, నాటు సారాపై దృష్టి పెట్టండి: శ్రీసత్యసాయి ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో అక్రమ మద్యం, నాటు సారా, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాలోని సేబ్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, పనితీరు, వారి విధుల గురించి ఎస్పీ ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 23, 2024

కలెక్టరేట్‌లో ‘అనంత మమతా నిలయం’ ప్రారంభం

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వినూత్నంగా ఆలోచించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, కలెక్టరేట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా అనంతపురం కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదికి ‘అనంత మమతా నిలయం’ అనే పేరు పెట్టారు. చిన్నారులు ఆడుకునేలా బొమ్మలు, గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు.

News July 23, 2024

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి: అనంత ఎస్పీ

image

మీకోసం కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పోలీస్ సిబ్బంది వెంటనే పరిష్కరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ మురళీ కృష్ణ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 109 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

News July 23, 2024

పారా క్రీడాకారులను అభినందించిన అనంత కలెక్టర్

image

కర్ణాటకలోని బెంగళూరు వేదికగా కంఠీరవ స్టేడియంలో జులై 15 నుంచి 17 వరకు జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024లో పతకాలను సాధించిన అనంతపురం జిల్లా పారా క్రీడాకారులను కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. దేశం తరపున పాల్గొనేందుకు ఇప్పటి నుంచే సాధన చేయాలని క్రీడాకారులకు కలెక్టర్ సూచించారు.

News July 22, 2024

బొమ్మనహాల్: ఎగువ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు

image

బొమ్మనహాల్ మండలంలోని తుంగభద్ర జలాశయం నుంచి సోమవారం ఎగువ కాలువకు తుంగభద్ర బోర్డు సెక్రటరీ వారికి రెడ్డి, ఎస్ ఈ శ్రీకాంత్ రెడ్డి, ఈఈ రవిచంద్ర నీటిని విడుదల చేశారు. మొదట 100 క్యూసెక్కుల నీటిని ఎగువ కాలువకు విడుదల చేశారు. గంట గంటకు పెంచుకుంటూ పోతూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతామని తుంగభద్ర బోర్డ్ అధికారులు తెలిపారు.

News July 22, 2024

హిందూపురం: మహిళ కడుపు నుంచి 3కేజీల కణతిని తొలగించిన వైద్యులు

image

హిందూపురం రూరల్ మండల పరిధిలోని మోతుకపల్లికి చెందిన కల్పన అనే మహిళ కడుపు నుంచి మూడు కేజీల కణతిని వైద్యులు తొలగించారు. సోమవారం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బాబా బుడన్, లక్ష్మీ రామ్ నాయక్, రోహిత్ కుమార్ తదితరులు ఆపరేషన్ చేసి మహిళ కడుపు నుంచి మూడు కేజీల కణతిని తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

News July 22, 2024

మడకశిర: లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాలు..మడకశిర మండలం బుల్లసముద్రం గ్రామం వద్ద వ్యక్తి రోడ్డు దాటుతుండుగా లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ లారీ ఆపకుండా వెళ్లినట్లు తెలిపారు. మృతుడు బుల్లసముద్రం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మడకశిర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News July 22, 2024

అసెంబ్లీలో అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు

image

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల, సవిత, సత్యకుమార్ యాదవ్ ముందు వరుసలో కూర్చుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అలాగే జిల్లాకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు జిల్లా ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.

News July 22, 2024

అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకలకుంట వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News July 22, 2024

సత్యసాయి జిల్లా బాలికకు గోల్డ్ మెడల్

image

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికా రెడ్డి బంగారు పతకంతో మెరిశారు. బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో ఈ పతకాన్ని సాధించారు. తలుపుల మండలం గంజివారిపల్లెకు చెందిన గుణరంజన్ రెడ్డి కుమార్తె సోహన్వికా చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు.