India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీకి భారత క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాహుల్, సూర్యకుమార్, గిల్, దూబే వంటి క్రికెటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. సుమారు యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు. ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం అనంతపురం జిల్లా చరిత్రలోనే తొలిసారి. సెప్టెంబరు 2న క్రికెటర్లు అనంతపురానికి చేరుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించింది. రాయలసీమలోని జిల్లాల్లో కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, తుముకూరు నూతన మార్గానికి రూ.250 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కంబదూరు రైల్వే స్టేషన్ పరిధిలో కూడా పలు అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నియోజకవర్గ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ జగదీశ్ సోమవారం పెద్దారెడ్డి ఇంటికి బహిష్కరణ నోటీసులు పంపించినట్లు సమాచారం. తాము అనుమతిచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీళ్లేదని అందులో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి.

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామంలో సోమవారం విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాబు (24) అనే వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనంతపురంలోని ఇస్కాన్ ఆలయం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే అతి అందమైన ఇస్కాన్ ఆలయాలలో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధా సమేతంగా కొలువై ఉన్నారు. ఆలయం గుర్రం లాగిన రథం లాగా కనిపిస్తుంది. ప్రవేశద్వారం వద్ద నాలుగు భారీ గుర్రాల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 2008లో ప్రారంభించగా ఎంతో వైభవంగా విరాజిల్లుతోంది. రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.

‘మన టీడీపీ’ యాప్‌లో టాప్‌లో నిలిచిన టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. యాప్ ద్వారా తెలుగుదేశంపార్టీ కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి టాప్ స్కోర్‌లో సాధించిన వారికి వారు ప్రశంస పత్రాలను పంపించారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్యకర్తలకు ఆ ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అందజేసి అభినందించారు.

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణుని ఆలయంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలని ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిపై ఆ శ్రీకృష్ణ భగవానుడి కరుణాకటాక్షం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అనంతపురం స్థానిక ఐటీఐ కళాశాలలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామమూర్తి ఆదివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం సమీపంలోని అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు భోజన వసతితో పాటు నెలకు రూ.14 వేలు వేతనం చెల్లిస్తారు.

ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేసే నిందితుడికి మేనరికం వివాహం కావడం వల్ల ముగ్గురు పిల్లలు మతిస్థిమితలేమితో పుట్టారు. చిన్న కుమార్తె ఓ స్వచ్ఛంద సంస్థలో చదువుతూ.. పింఛను కోసం ఇంటికొస్తుంది. ఈ క్రమంలో తండ్రి ఈ నెల తొలివారంలో దారుణానికి ఒడిగట్టాడు. దీంతో కుమార్తెతో కలిసి తల్లి శనివారం అనంతపురం దిశ PSలో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు.

ప్రతి సోమవారం అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబరు 2వ తేదీన నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.