India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బొమ్మనహాల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ చార్యులు, సంతోష్ కుమార్ చార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు జరిపించి వెన్నతో అలంకరణ చేసి అష్టోత్తర సహస్రనామాలు నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పుట్టపర్తిలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాటు చేపట్టినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే వేడుకలకు దిశ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వైజాగ్ నుంచి 2,500 మంది భక్తులు వచ్చారని, పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు వేడుకలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సమీపంలోని 47వ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న కారు నీటి ప్రవాహంలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో కురిసిన అధిక వర్షానికి హోండా వెర్నా కారు మునిగిపోయింది. గమనించిన గ్రామస్థులు అక్కడకు వెళ్లి చూడగా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లికి చెందిన వ్యక్తి కారుగా గుర్తించారు.

అనంతపురం జిల్లా కుందుర్పిలోని ఓ పురాతన ఆలయంలో అంతుబట్టని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇటీవల ఆలయ తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన పురావస్తు శాఖ అధికారులు కొన్ని విలువైన రాతి విగ్రహాలను గుర్తించారు. అయితే లోపల వాతావరణం అనుకూలించకపోవడం, చీకటిగా ఉండటంతో బయటికి వచ్చి ఆలయానికి తాళం వేశారు. ఇప్పుడు ఆ ఆలయ చరిత్రపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరోసారి అధికారులు ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించనున్నట్లు సమాచారం.

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.15.4 కోట్ల నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ ఎకోపార్క్, కదిరిలోని బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకోపార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని, నగర వనాలపై దృష్టి సారించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

కదిరిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు మహిళలు న్యూఅమీన్ నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని, ఇతర ప్రాంతం నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రణాళిక ప్రకారం దాడి చేసి అరెస్టు చేశామన్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు సమస్యలపై జిల్లా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో వచ్చే వినతులకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు.

డీ.హీరేహల్ మండలంలోని దొడగట్టకు చెందిన రాజు(18) అనే విద్యార్థి ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి శనివారం తెలిపారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల సందర్భంగా నిన్నటి రోజు ఊరికి వచ్చాడు. ఉదయం ఎవరూ లేని సమయంలో ఇంట్లో చీరతో ఉరివేసుకొని మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్యానవన రంగానికి సరైన సహకారం అందిద్దామని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, ఉద్యానవన,, మార్కెటింగ్ శాఖలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొన్ని ముఖ్యమైన పంటలను అభివృద్ధి చోదక వాహనాలుగా ఎంపిక చేసి, వాటి సమ్మిళిత అభివృద్ధి ప్రణాళికను తయారుచేసి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అనంతపురం జిల్లాలో ఏటీఎంలలో చోరీ చేసిన ఐదుమంది హరియాణా దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జగదీశ్ శనివారం వెల్లడించారు. ఘటనల్లో 11 మంది పాల్గొన్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి ఒక లారీ, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.