India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాలు పడే అవకాశం ఉందని AP ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసిందని అనంతపురం కలెక్లటర్ తెలిపారు. కావున ప్రజలందరూ నీటి ప్రవాహం దగ్గరగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. 8500292992, 08554-220009 నంబర్లకు సంప్రదించాలన్నారు.
గుత్తి మండలం టి.కొత్తపల్లికి చెందిన నరేశ్ పలు చోరీలు, గంజాయి కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. మతిస్తిమితంలేని వ్యక్తిగా ప్రవర్తిస్తుండటంతో 2నెలల కిందట విశాఖలోని పిచ్చాసుపత్రిలో చేర్చించారు. పిచ్చి నయంకావడంతో అతడిని బుధవారం అనంత ఏఆర్ పోలీసులు విశాఖ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బయలుదేరారు. రైల్వేస్టేషన్‌లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఉరవకొండ పోలీసులు నరేశ్‌ను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
టీడీపీ నాయకుడు అదెప్ప హత్య కేసులో ప్రధాన నిందితుడు కేశవరెడ్డిని గురువారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈనెల 9న రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన అదెప్ప హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసులో ప్రధాన నిందితుడు కేశవరెడ్డి వారం రోజుల కిందట కళ్యాణదుర్గం కోర్టులో లొంగిపోయాడు. దీంతో జడ్జి 14రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తరలించారు.
గుంతకల్లులోని హౌసింగ్ బోర్డులో అద్దె ఇంట్లో నివాసముంటున్న కర్నూలు జిల్లా చిప్పగిరి ఎంపీపీ హేమలతకు చెందిన కారు అద్దాలను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గురువారం ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ సైనికుల సంఘం సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికుల సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలోని బత్తలపల్లి, ఎన్పీ కుంట, నల్లమాడ, కదిరి, ఓడీసీ, నల్లచెరువు, హిందూపురం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుకున్నారు.
అనంత జిల్లాలో సుపరిపాలనకు మరో అడుగు ముందుకు వేయడమే లక్ష్యంగా కలెక్టర్ వినోద్ కుమార్ మంచి ఆలోచనకు బీజం వేశారు. అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న దాదాపు 103 శాఖల రోజువారి నివేదికలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలు, అంశాలపై రోజు మానిటరింగ్‌పై దృష్టి పెట్టారు.
రాయదుర్గం మండలంలోని డీ.కొండాపురంలో జెస్సికా (16) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎక్సైజ్, సెబ్ పోలీస్ అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా చర్యలు చేపట్టి నాటుసారా, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల పూర్తి నిర్మూలనకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా సీనియర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు నియమితులయ్యారు. ఈయన ఇదే జేఎన్టీయూలోనే బీటెక్ (1979-83) పూర్వ విద్యార్థి కావడం విశేషం. గతంలో ఈయన తన మెరిట్ ప్రతిపాదన క్రింద జేఎన్టీయూ రెక్టార్‌గా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2007లో ఏపీ ప్రభుత్వం నుంచి బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు.
Sorry, no posts matched your criteria.