India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మవరం-చిగిచెర్ల రైల్వే స్టేషన్ల మధ్య గురువారం గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి కిందపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చిగిచెర్ల సమీపంలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
కర్నూలులో బుధవారం <<13648791>>హత్య<<>> జరిగింది. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిస్తోంది. ఆ కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పెనుకొండ మండలంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిందుతుడు గంగాధర్‌కు మతిస్థిమితం లేదు. తనను చంపేందుకు తండ్రి మనుషులను పంపుతున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిందూపురానికి చెందిన చిరువ్యాపారి చిన్నఅంజినప్ప గుట్టూరులోని కొల్హాపురి ఆలయంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి గంగాధర్ ఆలయానికి వచ్చి తన తండ్రి తనను చంపేందుకే అంజినప్పను పంపాడని గొడవపడి తువాలుతో గొంతు బిగించి హత్య చేశాడు.
ప్రజలకు జవాబుదారీతనంతో చట్టానికి లోబడి పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించాలని ఎస్పీ వెలిసెల రత్న పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంచుతూ సమన్వయంతో ముందుకెళ్తానన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్చెల్సీకి ఈనెల 21 నీరు విడుదల చేయాలంటూ హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ తుంగభద్ర మండలి ఎస్‌ఈకి బుధవారం ఇండెంట్ లేఖ పంపారు. 25వతేదీ వరకు 500 క్యూసెక్కులు, 26 నుంచి 31వరకు 750 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. నీరు విడుదలచేస్తే 22కి జిల్లా సరిహద్దుకు చేరే అవకాశం ఉంది. ప్రధాన కాలువల ద్వారా కణేకల్లు చెరువుల్లోకి చేరి అక్కడ నుంచి ఏపీబీఆర్ జలాశయం, జీబీసీ కాలువకు ప్రవాహాలు కొనసాగుతాయి
మంత్రి సవిత నేడు రొద్దం మండలంలో పర్యటిస్తారని ఆమె కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు మండల పరిధిలోని కోగిర చెరువును పరిశీలిస్తారన్నారు. అనంతరం పెద్ద కోడి పల్లి చెరువు మరువని పరిశీలిస్తారని, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొనాలని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్‌ను ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు శ్రీరామ్ తెలిపారు. ‘ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించా. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఇరువురం మాట్లాడుకున్నాం. ప్రతి అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’ అని శ్రీరామ్ ట్వీట్ చేశారు.
శింగనమల నియోజకవర్గం పుట్లూరులో 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంపై ఇటీవల Way2News స్పెషల్ స్టోరీ <<13523159>>పబ్లిష్<<>> చేసింది. ఈ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం స్వయంగా కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ఎస్సీ వసతి గృహానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని సౌకర్యాలపై నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.
అనంతపురం పట్టణంలోని ఎస్కే యూనివర్సిటీ వసతి గృహంలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. యువతి ఉంటున్న గదిలో ఫ్యాన్‌కి వేలాడుతుండగా అక్కడే ఉన్న గమనించిన తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి కిందకు దించారు. విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మౌనిక ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. మౌనిక స్వగ్రామం పులివెందులని తోటి స్నేహితులు తెలిపారు.
పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలోని ఓ ఆలయం వద్ద హిందూపురానికి చిన్న అంజప్ప (55)బుధవారం హత్యకు గురయ్యారు. పూజ సామాగ్రి అమ్ముకునే చిన్న అంజప్ప ఆలయం వద్ద నిద్రిస్తుండగా గంగాధర్ మధ్య వాగ్వాదం జరిగింది. టవల్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగుడు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.