India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల19వ తేదీ లోపు అనంతపురం సర్వజనాస్పత్రిలో 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరఫున ఆయన సతీమణి పయ్యావుల హేమలత నామినేషన్ వేశారు. గురువారం ఉదయం తనయుడు పయ్యావుల విజయ్ సింహ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్‌కు అందజేశారు.
మడకశిరలో వైఎస్ షర్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటి శ్రీధర్, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి కే. సుధాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్వాగతం పలికారు. మడకశిర పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొంటున్నారు. ఈ సభలో పాల్గొనడానికి జిల్లావ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారని అన్నారు.
గుమ్మగట్ట మండలం వీరాపురం గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవంతి(13) అనే బాలిక పాముకాటుతో మృత్యువాత పడింది. ఆసుపత్రికి తరలించేలోపు బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో యల్లనూరు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఇ.విజయకుమారి, కూడేరు మండలం గొటుకూరు గ్రామ సీనియర్ మేట్ ఎన్. జయప్ప ఉన్నారు. అలాగే పలు చోట్ల ఎస్ఎస్ఈ బృందాలు రూ.2.80 కోట్ల నగదును సీజ్ చేశారన్నారు.
కాచిగూడ- యశ్వంతపుర మధ్య నడిచే వందేభారత్ పై దాడి జరిగింది. పామిడి-కల్లూరు మధ్య బుధవారం ఉదయం వందేభారత్ రాగానే కొందరు ఆకతాయిలు సీ4 బోగీపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. గతంలో ధర్మవరం- బత్తలపల్లి సమీపంలో దుండగులు రాళ్ల దాడికి పాల్పడగా, ఆ తర్వాత అనంతపురం సమీపంలో మరోసారి అదే రైలుపై రాళ్ల దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ సూచించారు. బుధవారం శింగనమల మండల కేంద్రంలోని నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు చేసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల వద్ద నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం వ్యయ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పార్లమెంటు నియోజవర్గానికి అమిత కుమార్, మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాలకు వినాయక్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు రిదయం బహుదజలు జిల్లాకు వచ్చారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామ పరిధిలో ఇసుక రవాణా చేస్తున్న వారిని గ్రామస్థులు అడ్డుకొని అక్కడ నుంచి టిప్పర్లు, హిటాచీలను తరలించారు. దయచేసి రైతులకు అన్యాయం చేయకండి.. ఇసుక లేకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రైతుల గురించి అలోచించి ఇసుక రీచ్‌లకు అనుమతులివ్వకండి అని అధికారులు కోరుతున్నారు. ఇసుక తవ్వకాలు జరిగే చోటే తాగునీటి బోర్లు ఉన్నాయని తెలిపారు.
లేపాక్షి ఆలయాన్నికి రామాయణంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుని తీసుకెళుతుండగా కూర్మ పర్వతంపైన జటాయువు అడ్డగిస్తాడు. రావణుడు అడ్డొచ్చిన ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో పడిపోయింది. సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు విషయం తెలుసుకుని ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షీ అని పలికాడు. ఆ పదమే కాలక్రమేణా లేపాక్షిగా మారిందని స్థలపురాణం.
Sorry, no posts matched your criteria.