India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు గ్రామ పొలాల్లో దారుణం చోటు చేసుకుంది. మేకల కాపరి జయమ్మ అనే మహిళను గొంతు బిగించి దుండగులు దారుణ హత్య చేశారు. 20 మేకలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం మేకలు తోలుకొని వెళ్లిన జయమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇవాళ ఉదయం గ్రామ పొలాల్లో శవాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనంతపురం జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని డీఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తాజా పరిస్థితులను సమీక్షించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల్లో భరోసా కలిగించడంలో దోహదం చేసే బేసిక్ పోలీసింగ్‌ను మెరుగు పరుచుకోవాలన్నారు.

డా.ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల నిమిత్తం కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలు తెలిపారు. అనంతపురంలో ఉన్న డా.ఎన్టీఆర్ వైద్య సేవ కో-ఆర్డినేటర్ కార్యాలయంలో ఫోన్ నెంబర్ 08554 -247266 ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా ప్రోత్సహిస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఐడీపీ 2024-29 పాలసీకి సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.

అనంతపురం జిల్లా గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మాల మహానాడు JAC ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జేఏసీ నాయకుడు కేవీ చలపతి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈనెల 21న ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు.

సెప్టెంబర్ 1వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు వారి యాక్షన్ ప్లాన్ సమర్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే పనులను విజన్ డాక్యుమెంటరీలో రూపొందించాలని పేర్కొన్నారు. ప్రణాళికలు వేసేటప్పుడు ముఖ్య శాఖల మధ్య సమన్వయం ఉండాలని, గడువులోగా ఉపయుక్తమైన ప్రణాళికలు పంపాలని తెలిపారు.

పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 81 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు ఎస్పీలు ఆర్.విజయ భాస్కర్ రెడ్డి, జీ.రామకృష్ణ ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలనే ప్రభుత్వం సంకల్పంతో పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండీ వచ్చిన ప్రజలు స్వేచ్ఛగా పిటిషన్లు అందజేశారు. అదనపు ఎస్పీలు పిటిషనర్లతో ముఖాముఖి మాట్లాడారు.

చట్ట పరిధిలో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 25 ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ లో సూచించారు.

నీటి బకెట్‌లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన బత్తలపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాప్తాడు మండలానికి చెందిన ఆదెప్ప, పుష్పావతి దంపతులు మేనమామ పెళ్లి కోసం అనంతసాగరం గ్రామానికి వచ్చారు. కుటుంబ సభ్యులు పెళ్లి సంబరంలో ఉండగా చిన్నారి ఆడుకుంటూ నీరున్న బకెట్‌లో పడిపోయింది. స్థానికులు గమనించి బయటకు తీసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

అనంతపురం జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలంలోని ధర్మపురి గ్రామంలో ఎరికల నల్లప్ప అనే గొర్ల కాపరి గొర్రెకి ఆరు కాళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. ప్రత్యేకంగా పుట్టిన ఈ గొర్రెపిల్లను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. విషయాన్ని స్థానిక పశువైద్యాధికారి దృష్టికి యజమాని తీసుకెళ్లారు.
Sorry, no posts matched your criteria.