India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురంలో వచ్చే నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జరగనున్నాయి. ఇందులో టీమ్-ఏకు శుభమన్ గిల్ నాయకత్వం వహించనున్నారు. జట్టు ఇదే: గిల్ (C), మయాంక్ అగర్వాల్, పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుస్ కోటియన్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ కృష్ణ, ఖలీల్ అహమ్మద్, అవేశ్ ఖాన్, కావేరప్ప, కుమార్ కుషగ్ర, షస్వత్ రావత్

కూడేరు మండల పరిధిలోని అగ్రిగోల్డ్ భూములను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తుంగభద్ర డ్యాంపై చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైన విషయం తెలిసిందే. 19వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న 20 మంది కార్మికులకు కర్ణాటక మంత్రి జమీర్ ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున బహుమతిగా ఇచ్చారు. ఎమ్మెల్యే గణేశ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి వారికి నగదు అందజేశారు. అలాగే ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టెక్నికల్ బృందానికి కొప్పల్ ఎంపీ రూ.2 లక్షలను బహుమతిగా అందజేశారు.

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మోహిత హత్యాచారాన్ని ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ధర్మవరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యాచార్యులు బాబు బాలాజీ తమ శిష్య బృందంతో కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాట్యాచారులు బాబు బాలాజీ మాట్లాడుతూ.. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన కన్నయ్య నాయుడుపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 80 ఏళ్ల వయస్సులోనూ ఎండను లెక్క చేయకుండా స్టాప్‌లాగ్ ఎలిమెంట్లను అమర్చడంలో కీలక పాత్ర పోషించారు. జలాశయంలో 105 TMCల నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించగలిగారు. చిత్తూరు జిల్లాకు చెందిన కన్నయ్యకు 260 ప్రాజెక్టులకు క్రస్ట్ గేట్లను డిజైన్ చేసి అమర్చిన అనుభవం ఉంది.

అనంతపురం జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా వీఆర్‌లో ఉన్న తులసన్నను అనంతపురం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, తాడిపత్రి రూరల్‌లో పనిచేస్తున్న సాగర్‌ను నార్పల స్టేషనుకు బదిలీ చేశారు. నార్పల స్టేషన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డిని అనంతపురం వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతలో దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు 5వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇండియా క్రికెటర్లు 4 జట్లుగా విడిపోయి 3 రౌండ్లలో 19వ తేదీ వరకు మ్యాచ్‌లు ఆడనున్నారు. 5న బెంగళూరులో AvsB మధ్య మ్యాచ్ ఏర్పాటు చేయగా మిగతావన్నీ అనంతపురంలో CvsD, 12నAvsD, BvsC, 19న AvsC, BvsD జట్లు ఆడే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు కెప్టెన్లుగా ఉన్నారు.

తాడిపత్రిలోని ప్రభుత్వ కస్తూరిబా గాంధీ జనరల్ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మునెమ్మ పేర్కొన్నారు. కెమిస్ట్రీ సబ్జెక్టు పోస్టు ఒకటి, గెస్ట్ కుక్స్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పాఠశాలలో సంప్రదించాలని కోరారు.

అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.

అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి తాకీర్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పామిడి నుంచి గుత్తిలోని కళాశాలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.