India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంతకల్ పట్టణంలోని 4, 6, 18, 30వార్డులకు చెందిన, నెలగొండ, నాగసముద్రం, నక్కనదొడ్డి, N. కొట్టాల, N. వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన 200మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గుంతకల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేశారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించడానికి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నాయకురాలు బుల్లె శివబాల నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
హిందూపురంలో ‘మన అందరి FUTURE CM జూనియర్ ఎన్టీఆర్’ అంటూ ఫ్లెక్సీ వెలిసింది. దీంతో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మరోసారి చర్చించుకుంటున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో సోమవారం టీడీపీ, జూ.ఎన్టీఆర్ అభిమానులు ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘యువగళమైనా, జనగళమైనా, నవగళమైనా, ఏ గళమైనా.. ప్రతి తెలుగు నోటా స్మరించే పేరు ఒక్కటే. అది ఎన్టీఆర్’ అంటూ ప్లెక్సీపై రాయడంతో వైరల్‌గా మారింది.
ఆత్మకూరు మండలం కొత్తపల్లి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్‌ను ఢీకొడంతో ఎర్రిస్వామి గాల్లోకి ఎగిరి కారుపై పడి మృతిచెందాడు. డ్రైవర్ కారును ఆపకుండా సుమారు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హనిమిరెడ్డిపల్లి వద్ద ఆపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కదిరి నియోజక వర్గానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు చంద్రబాబు, లోకేశ్, నియోజక వర్గం అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలిశారు. మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిసి తన విజయానికి సహాయం అందించాల్సిందిగా అభ్యర్థించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన డీ.హమీదా జిల్లా రెండో ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ 987/1000 మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చదువు మధ్యలో తండ్రి చనిపోవడంతో నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి తన తల్లి, అన్న ప్రోద్బలంతో ఉన్నతమైన ర్యాంకును సాధించి అందరిచేత ప్రసంశలు అందుకుంది.
గుత్తి జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప.. పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి నియోజవర్గ కేంద్రాలకు నియోజవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. మే 13న జిల్లాలో పోలింగ్ జరుగనుండగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల ద్వారా పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్నామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఈ నెల 18 నుంచి 24వ తేదీలోపు చెల్లించాలని డీఐఈఓ రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రథమ ఇంటర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు 24వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.