India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయనను ఏపీఎస్పీ విశాఖపట్నం 16వ బెటాలియన్‌కు బదిలీ చేసింది. అయితే అనంతపురం జిల్లాలో అతి తక్కువ కాలం పని చేసిన ఎస్పీ జాబితాలో మురళీకృష్ణ, అమిత్ బర్దర్, గౌతమి శాలీ ఉన్నారు.

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజన్ 2047పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని, అందుకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖల 100 డాక్యుమెంట్ కు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చే విధంగా విజన్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అనంత: ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అందుకే బీసీలకు మాత్రమే డీఎస్సీ కోచింగ్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను పక్కన పెట్టిందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని కోరుతూ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి వినతిపత్రం అందజేశారు.

రామగిరి మండలం ముత్యాలంపల్లి సమీపంలోని పరిటాల సునీత సొంత వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. ఇందులో భాగంగా పొలం దగ్గర ఏర్పాటు చేసిన గంగ పూజలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, కూలీలు ఉన్నారు.

అనంతపురం జిల్లా దేశవాళీలో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ అమిత్ సిద్దేసర్ ఇటీవల అనంత క్రీడా మైదానాన్ని సందర్శించారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 22 వరకు 4మ్యాచ్‌లు జరగనున్నాయి. సూర్యకుమార్ యాదవ్, రుతు రాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్, కేఎల్ రాహుల్, కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా రానున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకీ మీ ఊరిలో ఇప్పుడు వాతావరణం మారిందా? లేదా? కామెంట్ చేయండి.

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కంబదూరు మండలంలో భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కంబదూరు మండలం అండేపల్లి గ్రామ సచివాలయానికి సంబంధించిన అధికారులు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ జెండాను ఆవిష్కరించలేదు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనంతపురం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు విషాద ఘటన చోటు చేసుకుంది. కనేకల్ మండలం మాళ్యం గ్రామానికి చెందిన రాజేశ్ ఈతకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి మృత్యువాత పడ్డాడు. చెరువులో మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోధించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావేరి(27) అనే నిండు గర్భిణి విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందింది. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మృతిచెందింది. పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యాడికి మండలంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విష్ణు భగవాన్‌కు భారత సేవా పురస్కార్, దేశ రత్న పురస్కార్ జాతీయ అవార్డులను కర్ణాటకలోని బెంగళూరులో అందుకున్నారు. బెంగళూరు ఎన్జీవో సంస్థ వెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో నాణేల సేకరణ, ప్రదర్శనలు నిర్వహించి కళలకు విశేషమైన సేవలు అందించినందుకు అందించారు. కానిస్టేబుల్ విష్ణును పోలీసు ఉన్నతాధికారులు, మండల అధికారులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.