India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అమడగూరు వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా హరిత నియామకం రద్దుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ‘నేను చూసిన అత్యంత అవినీతిపరులైన అధికారులలో హరిత ఒకరు. తిరుపతి కార్పొరేషన్‌లో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో సూత్రధారి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోస్టింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసిందా అన్న ప్రచారం జోరందుకుంది.

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా తన నివాసానికి జాతీయ పతాకాన్ని కట్టారు. అనంతరం జాతీయ జెండాతో సెల్ఫీ దిగారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ప్రదర్శించి జాతీయ ఐక్యతను చాటాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులను ఎప్పటికీ మరవకూడదని వారు చేసిన త్యాగాన్ని కొనియాడారు.

అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ 1934 SEP 21న పర్యటించారు. బహిరంగసభలో ప్రసంగించగా చైతన్యవంతులై దేశభక్తి భావాలు కలిగిన కొందరు ప్రతిస్పందించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం అప్పట్లోనే దాదాపు రూ.27 వేలు విరాళంగా అందజేశారు. చింతలచెరువుకు చెందిన భూస్వామి హంపమ్మ తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేయడంతో పాటు రూ.1,116ల నగదును గాంధీకి విరాళంగా ఇచ్చారు.

అనంతపురం జిల్లాలో 16, 17, 18వ తేదీల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి బుధవారం ఓ తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు.. పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంక్రీటు భవనాల్లోనే ఆశ్రయం పొందాలని, చెట్ల కింద, కరెంటు పోల్ కింద ఉండకూడదని వారు సూచించారు.

అనంతపురం పేరు వినగానే ‘టవర్ క్లాక్’ గుర్తుకొస్తుంది. నగర నడిబొడ్డున ఉన్న ఈ టవర్ క్లాక్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయగా సిద్ధించిన స్వాతంత్ర్య ఉద్యమానికి గుర్తుగా అనంతపురంలో 1947 ఆగస్టు 15న నిర్మించారు. అష్ట భుజాలతో 47 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదీని, అష్ట భుజాలు 8వ నెలను, 47 అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని సూచించేలా నిర్మించడం విశేషం.

అనంతపురం, కర్నూలు జిల్లాల రేంజ్ పరిధిలో 62 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు రైల్వే, అనంతపురం ఎస్పీ కార్యాలయాల్లో ఉన్న సీఐలను కర్నూలు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు బదిలీ చేశారు. వారు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. పలువురిని వీఆర్‌కు పంపారు.

కంబదురు మండలంలో సోమవారం జరిగిన తిప్పేస్వామి హత్యకేసులో రాళ్ళపల్లి గ్రామానికి చెందిన మల్లెల రాజు, నరేశ్‌లను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ రవికుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామిని రోడ్డుకు అడ్డగించి బండ రాళ్లతో దాడిచేసి హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు వివరించారు. కేసు ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూ పరిధిలో మే, జూన్ నెలల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ కేశవరెడ్డి తెలిపారు. బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్లు, రెండో సంవత్సరం రెండో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.