India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంత వ్యవసాయ మార్కెట్ యార్డు సంతలో చీనీ కాయల ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 7న టన్ను రూ.35 వేలు ఉండగా 8న రూ.38 వేలకు పలికింది. ఈనెల 9న రూ.36 వేలు, 10న రూ.37 వేలు, 11న రూ.38 వేలు ధర పలికింది. మూడ్రోజులుగా టన్ను రూ.1000 చొప్పున ధర పెరుగుతూనే ఉంది. విక్రయాలు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. గురువారం కాస్తా విక్రయాలు పెరిగాయి. మొత్తం 219 టన్నులు వచ్చాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైనట్లు బుక్కరాయ సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. అదే విధంగా సీకే పల్లి 41, గుంతకల్ 40.9, తలుపుల 40.8, కదిరి 40.6, యల్లనూరు 40.5, ధర్మవరం, పరిగిలో 40.4, శెట్టూరు 40.3,యాడికి 40.2,కుడేరు, సింగణమలలో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన డ్రైవర్ లాల్ బాషా విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నమాజు చదువుకునే ముందు వుజూ చేసుకునేందుకు నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది. ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఉరవకొండలో చికిత్స పొందుతూ బాషా మృతి చెందాడు.
పామిడి మండలంలోని కండ్లపల్లిలో ఓ దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన యువతిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెంబడించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో 170 జూనియర్ కళాశాలల నుంచి 41,556 మంది ఇంటర్ విద్యార్థులు రెగ్యులర్, ఒకేషనల్ వార్షిక పరీక్షలు రాశారు. వీరిలో 24,446 మంది మొదటి సంవత్సరం, 17,110 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 21న మూల్యాంకనం ప్రారంభం కాగా ఈనెల 4 నాటికి పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
బుక్కరాయసముద్రం (మం) భద్రంపల్లిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి పాల్గొన్నారు. స్మశాన వాటిక లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏళ్ల నుంచి స్మశాన వాటిక సమస్య పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదని గ్రామస్థులు వాపోయారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భద్రంపల్లి ప్రజలకు స్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
యాడికి మండలం గుడిపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు విషపురుగు కుట్టడంతో మృత్యువాత పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మమ్మ ఇంటి వద్ద అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో విషపురుగు కుట్టింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కొత్త పల్లి గ్రామ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో విద్యుత్ షాక్‌తో రాధమ్మ అనే మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తన ఇంటి సమీపంలో పంచాయతీ బోరు ఉండడంతో వంట పాత్రలు కడగడానికి వెళ్ళగా.. విద్యుత్ తీగలు ఆమెకు తగలడంతో మృతి చెందినట్లు భర్త హనుమంతు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుంతకల్లులోని కసాపురం రోడ్డులోని అయ్యప్ప దేవాలయం వద్ద బుధవారం హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ వైరు తెగిపడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే శాటిలైట్ అనుసంధానంగా ఆ లైన్ బ్రేక్ డౌన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్పందించిన ట్రాన్స్ కో ఉన్నతాధికారులు సిబ్బందిని పురమాయించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శెట్టూరు మండలంలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పరిగిలో 40.0, బొమ్మనహాళ్ 39.8, చెన్నేకొత్తపల్లి 39.7, తాడిపత్రి 39.5, పెద్ద వడుగూరు, కొత్తచెరువు 39.2, తలుపుల, రొద్దం 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.