India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

★ అనంతపురం జిల్లాలో 1741 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 971 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా 741 చోట్ల ఎన్నికలు జరిగాయి. కోరం లేక 29 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
★ సత్యసాయి జిల్లాలో 2065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2055 కమిటీలను ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. కోరం లేక 10 చోట్ల వాయిదా పడ్డాయి.

రాయదుర్గంలోని రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థను మార్చేందుకు నేడు రాయదుర్గం మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేసినట్లు నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్ ముఖ్య సమాచార అధికారి డాక్టర్ మంజునాథ్ తెలిపారు. చిక్కజాజూరు-గుంతకల్లు, హొస్పేట -బెంగళూరు మధ్య ప్రయాణించే 3 రైళ్లు రాయదుర్గం మీదుగా కాకుండా హొస్పేట, అమరావతి కాలనీ, దావణగెరె, చిక్కజాజురు మార్గంలో వెళ్తాయన్నారు.

అనంతపురం రేంజ్ పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసీ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 41 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వెంటనే తమకు కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణాలను వెంటనే మొదలుపెట్టి, శుక్రవారం నుంచి పనుల్లో పురోగతి చూపించాలని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 100 రోజుల్లో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం కేటాయించిందని అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేసి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

గుత్తి జీఆర్‌పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలి (ప్యాకింగ్ మిషన్ కూలి) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్‌పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉమ్మడి అనంత జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయిస్తూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తి-తాడిపత్రి 67వ జాతీయ రహదారికి రూ.15 కోట్లు, NH42 రాప్తాడు-బత్తలపల్లి మధ్య రూ.15 కోట్లు, NH42 కళ్యాణదుర్గం- మోలకమురు మధ్య రూ.29 కోట్లు, మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేసింది.

వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేసిన పైలా నరసింహాయ్య నేడు బీజేపీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో కండువా కప్పుకున్నారు. కాగా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నిన్న ఆయన ప్రకటించారు.

అర్హులందరూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులలో పనిచేసే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించే పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.

హిందూపురం డీఎస్పీగా కేవీ మహేశ్‌ను ప్రభుత్వం నియమించింది. డీఎస్పీల బదిలీల్లో భాగంగా పశ్చిమ గుంటూరులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కేవీ మహేశ్ ఇక్కడికి కేటాయించింది. అనంతపురం రూరల్‌లో డీఎస్పీ బీ.వెంకటశివారెడ్డిని పోలీస్ హెడ్ క్వాటర్స్‌కు బదిలీ చేసింది. కాగా ఇటీవల నెల్లూరు నుంచి శ్రీనివాసులు పెనుకొండ డీఎస్పీ వచ్చారు.

ఎన్నికల ముందు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలను సొంత జిల్లాకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని 38 మంది ఎంపీడీవోలను కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు బదిలీ చేసింది. తక్షణమే గత స్థానాలకు ఎంపీడీవోలు బదిలీ కావాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 23 మంది, కడప జిల్లా నుంచి 15 మంది సొంత జిల్లాకు రానున్నారు.
Sorry, no posts matched your criteria.