India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్, ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమ రవాణా చేయకుండా అడ్డుకట్ట వేయాలని ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. పర్యవేక్షణలో భాగంగా ఇవాళ డోనేకల్ విడపనకల్ చెక్పోస్టును తనిఖీ చేశారు. వెహికల్ మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. వివిధ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని సిబ్బందికి తెలిపారు.
పెద్దవడుగూరు మండల పరిధిలోని అప్పేచెర్ల గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో బైక్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైకర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను పగడ్బందీగా, పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,561 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 923 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమర్ధవంతంగా పనిచేయాలని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ సిబ్బందికి సూచించారు. ఆదివారం సాయంత్రం గుంతకల్లు సబ్ డివిజన్ సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రశాంత ఎన్నికల కోసం సబ్ డివిజన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికలలో జరిగిన ఘటనలు, ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులను సమీక్షించారు.
ఈనెల 9వ తేదీ నుంచి 15 వరకు పాండిచ్చేరిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే 38వ యూత్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే ఏపీ బాలుర జట్టులో ధర్మవరానికి చెందిన విజయ్‌కు చోటు దక్కింది. విజయ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు ఎంపిక కావడం గర్వకారణమని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. పలువురు క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఈ ఏడాది లోనే తొలిసారి 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, శింగనమలలో 44.0 డిగ్రీలు, గుంత కల్లు, కదిరిలో 43.5, పుట్లూరు, చెన్నేకొత్తపల్లి 43.4, ధర్మవరం 43.3, సెట్టూరు, పుట్టపర్తి 43.0, తలుపుల 42.9, యల్లనూరు 42.7, కూడేరు 42.6, అనంతపురం 42.5, ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతలోని రూడ్సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటీ పార్లర్ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చెందిన వారు 19 నుంచి 45 సం. వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని హుస్నాబాద్ సమీపంలోని ఓ వర్గం శ్మశాన వాటిక వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘర్షణ చోటు చేసుకుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు గొడవకు దిగారు. బందోబస్తుకు వెళ్లిన ఏఎస్ఐ, పలువురు కానిస్టేబుల్ లపై ఆందోళన కారులు దాడులు నిర్వహించారు. దీంతో గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.