India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన కౌన్సిలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో తొలిరోజు బాలురకు, రెండోరోజు బాలికలకు మెరిట్ జాబితా మేరకు కౌన్సిలింగ్ చేపట్టారు. ఆయా తరగతుల్లో మొత్తం 63 సీట్లకు గాను 1.2 నిష్పత్తిలో 126 మందిని కౌన్సిలింగ్‌కు పిలిచారు.
తాడిపత్రి మండల పరిధిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలోనే జాకీర్ మృతి చెందగా, అక్బర్‌కు త్రీవంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించగా.. ఆస్పత్రిలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఇద్దరూ అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పుట్లూరు మండలంలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు. నిందితులు రవితేజ, నాగేంద్రను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనంత జిల్లా పోలీస్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నిర్వహించే పలు పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఇతరత్రా డిమాండ్లతో SFI, AISF, PDSEU, AISA, NSUI, PDSU సంఘాలు ఉమ్మడిగా బంద్ చేపట్టనున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని JNTU పరిధిలో సెమిస్టర్ పరీక్షలు 4న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య కేశవరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా పరీక్షలు వాయిదా వేశామన్నారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు తెలిపారు.
ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు, ఉజ్జయిని వాల్మీకి మహర్షి పీఠాధిపతి బాలయోగి ఉమేశ్ నాథ్ గురూజీని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్మి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాల్మీకుల ఎస్టీ అంశం గురించి చర్చించారు. సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
శ్రీ గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో జాప్యం చేస్తున్న అధికారులపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజుల క్రితం సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ మండిపడ్డారు. మరో నాలుగు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించడంతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాడిపత్రిలోని JC ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసు అతికించి వెంటనే తొలిగించారు. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో TDP, YCP వర్గాలకు చెందిన నాయకులను ఈనెల 11వ తేదీ వరకు పట్టణంలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అయితే JC అక్క సుజాతమ్మ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందడంతో అంత్యక్రియల కోసం ఆయన పట్టణానికి వచ్చారు. కార్యక్రమం ముగిసినా వెళ్లకపోవడంతో నోటీసు అతికించి వెంటనే తొలగించడం చర్చనీయాంశమైంది.
డీ.హీరేహల్ మండలంలో కేరళ వాసి అబ్దుల్ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారి-బెంగళూరు హైవేపై ఓ డాబాలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడని, పని ముగించుకుని వెళ్లిన గంట సేపటికే హైవే పక్కన అబ్దుల్ పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.