India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 49 మంది వాలంటీర్లు, ఏడుగురు కాంట్రాక్ట్ సిబ్బంది, ముగ్గురు రెగ్యులర్ సిబ్బంది, ఇద్దరు రేషన్ డీలర్లను తొలగించామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
యాడికి మండలంలో వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్ధి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయలచెరువుకు చెందిన నిఖిల్ చౌదరి తమ సొంత పరిశ్రమ పనుల నిమిత్తం 2 రోజులు ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు- 2024 జిల్లాలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యమని నూతన ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగంతో కలసి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీ ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఉన్నా.. సమిష్ఠిగా ఎదుర్కొని పరిష్కరిస్తామన్నారు.
తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్‌ను సూర్యుడు గురువారం సాయంత్రం కిరణాలు తాకాయి. ప్రతి సంవత్సరం పాల్గుణ వైశాఖ మాసంలో సూర్యహస్తమయ సమయంలో కిరణాలు మూల విరాట్‌పై పడతాయని అర్చకులు తెలిపారు. శుద్ధ ఏకాదశి కావడంతో సూర్యుడి కిరణాలు స్వామి వారి మూల విరాట్‌పై పడ్డాయని అర్చకులు తెలిపారు.
సత్యసాయి బాబా అనువాదకుడు అనిల్ కుమార్ భౌతికకాయాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు. రెండు రోజులు క్రితం ప్రొఫెసర్ అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతిచెందగా శుక్రవారం పుట్టపర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రొఫెసర్ అనిల్ కుమార్ పాడేను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మోశారు. సత్యసాయిబాబా అనువాదకుడిగా అనిల్ కుమార్ భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం 08: 47గంటలకు నూతన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా డా.వి.వినోద్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. నూతన కలెక్టర్‌కి ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పూల మొక్క అందించి ఘన స్వాగతం పలికారు.
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నియమితులైన వినోద్ కుమార్ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన గౌతమిని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు రెవిన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తానని హమీ ఇచ్చారు.
త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ.. సాధారణ, వ్యయ, శాంతిభద్రతల విభాగాలకు వేర్వేరుగా ముగ్గురు రాష్ట్ర పరిశీలకులు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు జిల్లాలోనే ఉంటారని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నివేదికలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.
కూడేరు మండలం సమీపంలోని స్థానిక వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో కళగళ్ల గ్రామానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి అనంత జిల్లాలోని పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం కోర్టులో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సివిల్ జడ్జి దీన ఒంగోలు సివిల్ జడ్జిగా అనంతపురం బదిలీ అయ్యారు. పెనుకొండ కోర్టులో పనిచేస్తున్న సివిల్ జడ్జి శంకర్రావును అనంతపురం సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, బొబ్బిలిలో సివిల్ జడ్జిగా ఉన్న వాసుదేవన్‌ను పెనుకొండకు బదిలీ చేశారు.
Sorry, no posts matched your criteria.