India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రక్రియలో విధులకు సంబంధించి ఎవరికి ఎలాంటి మినహాయింపులు లేవని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో జరిగిన సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా, వాటిని శిక్షణ తరగతులలో నివృత్తి చేసుకోవాలన్నారు.
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాకు బదిలీ అయిన ఆయన ఈ సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అన్బురాజన్ బదిలీ అయిన విషయం తెలిసిందే.
ధర్మవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా సాగిన రాక్షస పాలనకు అంతం పలుకుదామని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్‌లో తన బహిరంగ సభకు కదలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే.. 50వేల మెజారిటీలో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలు తలుచుకుంటే వైసీపీ పాలన నేలమట్టమవుతుందని చెప్పారు. ధర్మవరంలో వైసీపీ పాలన తొలగి.. ప్రజాపాలన రావాలని సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.
పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందిన ఘటన తాడిపత్రి మండలంలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీకి చెందిన హుసేన్ మియా పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందారు. అలాగే చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఆదెమ్మ నిన్న పింఛన్ కోసం వెళ్లి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. కర్నూలు(D) మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.
ధర్మవరం నియోజకవర్గంలో జి.నాగిరెడ్డి ప్రత్యేకస్థానంగా చెప్పవచ్చు. 1983 నుంచి 1989 వరకు వరుసగా మూడుసార్లు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో నియోజకవర్గ చరిత్రలోనే 40421అత్యధిక ఓట్ల మెజార్టీ, 1983లో 30605 రెండవ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ధర్మవరంలో ఈ రికార్డును బద్దలు కొడతారా కామెంట్ చేయండి.
పెద్దవడుగూరు మండలం భీమునిపల్లి శివారులోని కొండలో బుధవారం ఓ చిరుతపులి మృతి చెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. అనారోగ్యం కారణంగా మృతి చెందిందా..? లేక ఇతర కారణాలవల్ల మృతి చెందిందా..? అనే కోణంలో విచారణ చేపట్టారు.
అనంత జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకటో సెమిస్టర్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎంఫార్మసీ ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు.
పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివ, రాధా దంపతుల కుమారుడు అఖిల్ అనే ఏడాది బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికలవేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వస్తున్న పోస్టులు పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోస్టులు పెట్టే వారు నిబంధనలకు లోబడి పోస్టు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.