India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గార్లదిన్నె మండలంలోని కోటంక సుబ్రమణ్య స్వామికి ఆదివారం భక్తులు వెండి ఆభరణాలు వితరణ చేశారు. ఆకులేడుకు చెందిన కాశిరెడ్డి మదనమోహన్ రెడ్డి, సావిత్రమ్మ దంపతులు రూ.1,33,000 విలువ చేసే వెండి అర్ఘ్య పాత్ర ఉద్ధరిణి సమర్పించారు. కలుగూరు దేవా, వరలక్ష్మి దంపతులు రూ.23 వేలు విలువ గల వెండి అర్ఘ్య పాత్ర ఉద్దరిణి ఆలయ ప్రధాన అర్చకులు రామాచారులకు అందజేశారు.
అనంతపురంలో రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్నుకు గరిష్ఠంగా రూ.19వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.12వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. శనివారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 305 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి వెల్లడించారు. చీనీకాయలు ధరలు క్రమేణా తగ్గుతుండడంతో రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా బోర్డులను రద్దు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఒక బోర్డులో ఛైర్మన్‌తో పాటు పదిమంది సభ్యులు ఉంటారు. జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 63, గ్రామ పంచాయతీ స్థాయిలో 864 వ్యవసాయ సలహా బోర్డులు ఉండేవని.. ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఎస్కేయూ యూనివర్సిటీలో జులై 8 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మే 15 నుంచి యూనివర్సిటీలో వేసవి సెలవులు ఇచ్చామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా యూనివర్సిటీలో తాగునీటి సమస్య కారణంగా తరగతులు ప్రారంభించలేదు. జులై 8 నుంచి యూనివర్సిటీలో తరగతులతో పాటు వసతిగృహాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
జూలై 1న ఉదయం 6 గంటల నుంచే సామాజిక పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ, రేషన్ పంపిణీపై జేసీ కేతన్ గార్గ్, తదితరులతో సమీక్ష నిర్వహించి పింఛన్ల పంపిణి సజావుగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,254 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 27 బెంచ్‌లు నిర్వహించారు. రాజీ పడదగిన 707 క్రిమినల్ కేసులు, 69 సివిల్ కేసులు, 26 మోటారు వాహనాల పరిహారం కేసులు, 3,254 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సత్యవాణి పర్యవేక్షించారు.
కనగానపల్లి మండలం కొండపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్(31) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్ కుమార్ కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన వ్యక్తి అని, వ్యక్తిగత పనిమీద బైకులో వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడ్డాడని కనగానపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో అర్హులైన 2,70,966 మందికి రూ.184.70 కోట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని 54 సచివాలయాల్లో 4,349 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.
తాడిపత్రికి చెందిన చిన్నారి ముస్కాన్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ధ్రువీకరిస్తూ చిన్నారి ముస్కాన్‌కు సర్టిఫికెట్ జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.