Anantapur

News June 29, 2024

AI సృష్టించిన రాగి ముద్ద చిత్రం

image

నాటు కోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. అయితే ఇటీవల ఏఐ సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే ఏఐ సృష్టించిన రాగి ముద్ద ఫొటోను ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేశారు. చట్ని, రాగి ముద్ద, నెయ్యితో ఉన్న ఆ చిత్రం అందరికీ నోరూరిస్తోంది. దీనికి ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

News June 29, 2024

అనంత: లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిపై కేసు

image

లైంగిక వేధింపులకు పాల్పడ్డ చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ముష్టికోవెల ఆరోగ్య ఉప కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎం కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏఎన్‌ఎంలు సుభాషిణి, అశ్విని, కృష్ణమ్మలు తమను కూడా లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నారు.

News June 29, 2024

డి.శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరం: రఘువీరా రెడ్డి

image

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురం శ్రీనివాస్ మృతిపై మాజీ మంత్రి రఘువీరా రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ మంత్రివర్గ సహచరుడు డి.శ్రీనివాస్ మరణ వార్త అత్యంత బాధాకరం. భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 29, 2024

SKU వీసీ హుస్సేన్ రెడ్డి రాజీనామా

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ హుస్సేన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన హుస్సేన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 17న ఎస్కేయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

News June 29, 2024

అనంతపురం: వసతి గృహాలకు నిధులు మంజూరు

image

జిల్లాలో కొన్ని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల వసతి గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరమ్మతుల నిమిత్తం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 15 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు రూ.1.35 కోట్ల నిధులు మంజూరు చేశారు.

News June 29, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. జులై 1, 2వ తేదీల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకుల పెంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు.

News June 29, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.

News June 29, 2024

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోండి: ఏఎస్పీ

image

జులై 1వ తేదీ నుంచి నూతన చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై పుట్టపర్తి కోర్ టీంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై పోలీసు అధికారులు పూర్తిగా పట్టు సాధించాలన్నారు.

News June 28, 2024

కళ్యాణదుర్గంలో వ్యక్తి దారుణ హత్య

image

కళ్యాణదుర్గం సమీపంలోని కూరాకులతోట వద్ద వన్నూరు స్వామి(30) అనే వ్యక్తిని శుక్రవారం దుండగులు దారుణంగా హత్య చేశారు. కురాకులతోట గ్రామానికి చెందిన వన్నూరు స్వామిని దుండగులు గొంతు కోసి అతి దారుణంగా చంపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 28, 2024

పింఛన్ల పంపిణీకి పటిష్ట చర్యలు: కలెక్టర్

image

పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ పాల్గొన్నారు. లబ్ధిదారుల హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టామని, శుక్రవారానికి పూర్తవుతుందని తెలిపారు.