Anantapur

News June 28, 2024

అనంత: బ్యాంక్ అధికారుల ఒత్తిడి.. రైతు ఆత్మహత్య

image

నార్పలలోని చైతన్య కాలనీకి చెందిన నాగప్ప శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ అధికారుల ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో నాగప్ప తీసుకున్న లోన్‌కు సంబంధించి ప్రతినెలా వడ్డీ కట్టినప్పటికీ నోటీసులు రావడంతో భయంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

News June 28, 2024

గోరంట్ల: భార్యపై అనుమానంతో ఉరేసుకొని ఆత్మహత్య

image

భార్యపై అనుమానంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోరంట్ల మండలంలో చోటుచేసుకుంది. పాలసముద్రానికి చెందిన నరసింహ మూర్తి, సుగుణమ్మకు కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తరచూ ఫోన్ మాట్లాడటంపై భర్త మందలించే వారు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లిన భార్య రాత్రి వరకు తిరిగి రాలేదు. మనస్తాపం చెందిన నరసింహ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 28, 2024

అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి రూ.197.44 కోట్లు

image

అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 2,89,508 మందికి జులై 1న పింఛన్ అందజేయనున్నారు. పెంచిన ప్రకారం జులై నెలకు రూ.126.81 కోట్లు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.వెయ్యి అదనం కోసం రూ.70.62 కోట్లు కలిపి మొత్తంగా రూ.197.44 కోట్లు అందజేయనున్నారు. సచివాలయం సిబ్బంది జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభిస్తారు.

News June 28, 2024

అనంతపురం JNTU వీసీ రాజీనామా

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ జీ.వీ.ఆర్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటేషన్‌పై అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్స్‌లర్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

News June 28, 2024

ఆ ఘటనలపై నివేదిక ఇవ్వండి: మంత్రి పయ్యావుల

image

గుత్తి మండలంలోని రజాపురం గ్రామంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ నివేదిక కోరారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత తాగునీరు, కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అలాగే ఉరవకొండ మండలం చిన్న ముస్టూరులో నాగేంద్ర అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందిన ఘటనపై కూడా నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు.

News June 28, 2024

సత్యసాయి: ఇంటి వద్దకే పింఛన్లు

image

జూలై 1న ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. శనివారం బ్యాంకుల ద్వారా అధికారులు నగదు విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.

News June 27, 2024

గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె

image

జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలను జులై 7న ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 13 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జులై 7న స్వామి వారి తొలి దర్శనం, 9న అగ్నిగుండం ఏర్పాటు, 12న ఐదవ సరిగెత్తు, 14న చిన్న సరిగెత్తు, 16న పెద్ద సరిగెత్తు, 17న అగ్నిగుండం ప్రవేశం, 19న స్వామి వారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

News June 27, 2024

అనంతపురం: దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.

News June 27, 2024

టీడీపీపీ సెక్రటరీగా బీకే పార్థసారథి

image

టీడీపీపీ సెక్రటరీగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ లేఖను స్పీకర్ ఓం బిర్లాకు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితర టీడీపీ ఎంపీలు అందజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎంపీ పార్థసారథి తెలిపారు.

News June 27, 2024

అనంతపురం: దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.