India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ విరాళాలతో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని కలెక్టర్ పీ.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో రూ.44,13,436 విలువ గల పరికరాలు కలెక్టర్ పి.అరుణ్ బాబుకు అందజేశారు.
అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నట్లు సివిల్ విభాగాధిపతి బి.అజిత ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఎంటెక్ లేదా ఎంఈ చేసిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు www.uconpt.com వెబ్ సైట్ ని సందర్శించాలని సూచించారు.
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 78 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియా ద్వారా 78 ఫిర్యాదులు, జిల్లా కాల్ సెంటర్ నుంచి ఒక ఫిర్యాదు అందాయని, వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ఇందులో 27 మంది వాలంటీర్లు, ముగ్గురు కాంట్రాక్టు, ఇద్దరు రెగ్యులర్, ఒక రేషన్ పై చర్యలు చేపట్టమన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వైసీపీలో చేరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుత్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్‌ను నమ్ముకుని తాము తీవ్రంగా నష్టపోయామని పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.
రామగిరి మండలం కొత్తగాదిగకుంట గ్రామానికి చెందిన వైసీపీ జిల్లా కార్యదర్శి S.చిన్న పెద్దన్న శనివారం పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటూ అదే గ్రామానికి చెందిన బీజేపీ రామగిరి మండల కన్వీనర్ గొల్ల కృష్ణయ్య, వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు.
మడకశిర పట్టణం ఎగువ అచ్చంపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్(45) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్‌ఐ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన సోమశేఖర్ తాగుడుకు బానిసై, కుటుంబ పోషణ భారమై, జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
అంబికా లక్ష్మీ నారాయణ అంబికా గ్రూపు ఆఫ్ ఫార్మ్స్‌కు అధిపతి. బోయ సామాజిక వర్గానికి చెందిన ఈయన 2009లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. గత టీడీపీ హయాంలో అహుడా ఛైర్మన్‌గా ఉన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వాల్మీకి సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహర్షి వాల్మీకి భవన్ అధ్యక్షుడిగా, రోటర్ క్లబ్ సభ్యులుగా పనిచేశారు. తాజాగా అనంతపురం పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
జగన్ కేబినెట్‌లో మొన్నటి వరకు ఉన్న గుమ్మనూరు జయరాం, YCPని వీడిన విషయం తెలిసిందే. TDPలో చేరిన ఆయనకు నిన్న చంద్రబాబు గుంతకల్లు టికెట్ కేటాయించారు. YCPలో ఆయనకు కర్నూలు MP టికెట్ ఇచ్చినా వద్దనుకొని ఆలూరు టికెట్ కోసం ప్రయత్నించారు. ఆపై ఆ పార్టీనే వీడారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు టికెట్‌ను టీడీపీ వీరభద్ర గౌడ్‌కు ఇచ్చింది. ఈయన పక్క నియోజకవర్గం గుంతకల్లు నుంచి బరిలో దిగుతున్నారు.
సత్యసాయి కలెక్టర్ పి.అరుణ్ బాబు కదిరి మున్సిపాలిటీ సమావేశ మందిరంలో తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, కదిరి మున్సిపాలిటీ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఈ వెంకటనారాయణ, DWMA PD విజయ ప్రసాద్ పాల్గొన్నారు.
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావలసిన అవసరముందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నట్లు బీజేపీ నేత సత్యకుమార్ తెలిపారు. ధర్మవరం కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. తన నివాసానికి వచ్చిన మందకృష్ణతో సత్య తాజా రాజకీయాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ ఆశయం త్వరలో నెరవేరుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.