India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 5వ తేదీ లోపు మండల విద్యాధికారికి అందజేయాలన్నారు.

ఆగస్టు ఒకటో తేదీ సీఎం చంద్రబాబు మడకశిరకు రానున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం. సీఎం రాకను పురస్కరించుకొని జిల్లాస్థాయి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

డీ.హీరేహాల్ మండలం సోమలాపురం వద్ద ఉన్న లెవెల్ క్రాసింగ్ 24 గేటును ఈనెల 30న మూసివేయనున్నట్లు నైరుతి రైల్వే బళ్లారి సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రుద్రేశ్ తెలిపారు. ఈ గేటు వద్ద ఓవర్ హాల్టింగ్, వార్షిక నిర్వహణ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అంతరాయాన్ని గమనించాలని కోరారు.

పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 49వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, DIEPC) సమావేశం నిర్వహించారు.

అనంతపురం కోర్ట్ రోడ్డులోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా అధికారి ఏ.కళ్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్‌లో 40ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తి, అర్హతగల యువతీ యువకులు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

కార్గిల్ యుద్ధవీరుల త్యాగం, ధైర్య సాహసాలు అసామాన్యమని సమాజంలో అందరికీ స్ఫూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం సందర్భంగా రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ అధ్వర్యంలో శుక్రవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కార్గిల్ యుద్ధ వీరులకు, మాజీ సైనికులకు కార్గిల్ విజయ్ దివస్ మెమెంటో, పుష్ప గుచ్ఛాలతో జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు.

అందరికీ ఆదర్శంగా ఉంటూ పోలీసులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ సాయిధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. మరింత నిబద్ధత, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆగస్టు 17 నాటికి మరింత మెరుగుపరచుకోవాలన్నారు. సమాజంలో అందరికీ జవాబుదారిగా ఉండాలన్నారు.

స్వపక్షంలోనే విపక్షం తయారైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని వైద్య, ఆరోగ్య సమస్యలు చెప్పారు. అది మంచిదే. ప్రజారోగ్యం గురించి ఆలోచించి వారి నియోజకవర్గాల్లోని సమస్యలు చెప్తున్నారు. అధ్యక్షా.. గత ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో అవినీతికి పాల్పడింది. నియామకాల్లో రాజకీయ జోక్యంతో అవకతవకలకు పాల్పడింది’ అని అన్నారు.

సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. అనంతపురంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఏఆర్ సాయుధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడాతూ.. పరేడ్ బాగా చేశారన్నారు. యూనిఫాం సర్వీస్‌లో ఏఆర్, హోంగార్డులు, సివిల్ పోలీసులతో పాటు ప్రాధాన్యతగా సేవలు అందిస్తున్నారన్నారు.

ధర్మవరం మండలం ఎర్రగుంటకు చెందిన ముంతాజ్ బేగం(48) గురువారం వాటర్ హీటర్ తగిలి మృతిచెందారు. స్నానం చేయడానికి బకెట్‌లో నీళ్లు పోసి హీటర్ వేశారు. నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నించగా కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఆమెకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముంతాజ్ బేగం భర్త మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.