India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన.. గుండె పట్టుకున్నట్లు ఉందంటూ భార్యకు చెప్పారు. ఇంతలోనే భార్య ఒడిలోనే తుదిశ్వాస వదిలారు.
అనంత జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలోకి దూకి ఓ జంట నిన్న ఆత్మహత్య చేసుకోగా దీనికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. గుత్తి మండలానికి చెందిన నిజామా(35) తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మరిది మహబూబ్‌బాషా(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆందోళనకు గురైన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.
సత్యసాయి జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తుండటంతో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవనానికి నోటీసు అతికించడంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణకు తాఖీదులు ఇచ్చినట్లు కమిషనర్ అంజయ్య తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో 7 రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల 26న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అనంతపురంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో 3 రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు పదో తరగతి నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఉత్తీర్ణత ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. వర్షకాలం ప్రారంభమైనందున తాగునీరు కలుషితం కాకుండా చూడటం, దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు..పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం పాటించాలన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాను డయేరియా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. మురికి నీటి గుంతలపై మున్సిపల్, పంచాయితీ అధికారులు దృష్టి సారించాలన్నారు. డయేరియా కేసులు ఉన్నట్టు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు నిర్భయంగా తమ సమస్యలును తెలియజేయాలని వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు తీర్చడం కోసం పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండీ జిల్లా ఎస్పీ 79 ఫిర్యాదులు స్వీకరించారు.
అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో వార్డ్ జిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సోమవారం వెంకటేశ్ నాయక్ మిద్దె మీద నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూమృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
పెద్దపప్పూరు మండలం చాగల్లు డ్యామ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉదయం మహిళ నజయా మృతదేహం లభ్యం కాగా.. తాజాగా మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాషాగా పోలీసులు గుర్తించారు. వీరు ఇద్దరు మరిది, వదినలని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పింఛన్ పెంపునకు ఆమోదం తెలిపింది. ₹3 వేల నుంచి ₹4 వేలకు పెంచింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయనుంది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2.80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2.72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.
Sorry, no posts matched your criteria.