India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుండెపోటుతో నరసింహులు అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. గుత్తి మండలంలోని కె.ఊబిచెర్ల గ్రామంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరసింహులు ఆదివారం రాత్రి గుండెపోటుతో అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. ఆయన మృతిపై ఉపాధ్యాయుల సంఘం సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టమాట ధరలు కొండెక్కాయి. ఎన్నికల సీజన్ ముగిశాక వాటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. సామాన్యులు టమాటలను కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో టమాట రూ.80 ధర పలుకుతుంది. రెండు రోజుల కిందట కిలో రూ.60 ఉండగా ఒక్కసారిగా రూ.20 పెరగడంతో ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో పాటు క్యారెట్, బీన్స్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి కిలో రూ.120 పలుకుతోంది.
అనంతపురం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంత్రిగా మొదటిసారి పెనుకొండకు వచ్చిన ఆమె పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆమె మాట్లాడుతూ.. జులై 1న ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సద్దపల్లి వెంకటరెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆయన నల్లమాడ నియోజవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా 1985 నుంచి 1989 వరకు పనిచేశారు. సోమవారం ఉదయం 11గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.
హైదరాబాదులో అనంత జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. CI ఆదిరెడ్డి వివరాలు.. సురేశ్(36) HYDలో ఉంటున్నాడు. ఈనెల 20న షాద్‌నగర్ వెళ్తునట్లు భార్యకు చెప్పి వెళ్లిన సురేశ్ జడ్చర్లలో హైవే పక్కన హోటల్‌లో రూం తీసుకున్నాడు. అదేరోజు రాత్రి పురుగు మందుతాగి సూసైడ్ చేసుకోగా సిబ్బంది గుర్తించారు. ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికిందని భార్య మంజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
సీపీఎం అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు ముష్కిన్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన అనంతపురంలోని మార్కెట్ యార్డు వద్ద అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆవాజ్ రాష్ట్ర నాయకులుగా ఉన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రతి సోమవారం తహశీల్దార్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ‘మీకోసం’ అనే కార్యక్రమాన్ని ఈనెల 24 నుంచి ప్రారంభించనుంది. దీనిపై ఇది వరకే కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. జిల్లా మండల కేంద్రంలో ప్రజలు స్థానికంగా సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చుకోవచ్చు అన్నారు.
అనంతపురం జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేట్ సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది అర్హత సాధించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ. మురళీకృష్ణ తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించిన శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 30 మంది 3వేల లోపు ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు.
తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంటి ముందు ఉన్న రహదారిపై వర్షపునీరు నిలబడుతున్నాయని మట్టిని ఎత్తుగా వేశారు. దీంతో ఆ నీరంతా టీడీపీ నాయకుడు కథాలప్ప ఇంటి ముందుకు రావడంతో మట్టిని ట్రాక్టర్ తో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఐదు మందికి గాయాలయ్యాయి.
జిల్లాలో డయేరియాతో ఏ ఒక్కరూ బాధపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియాపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి ఆయా శాఖల జిల్లా అధికారులు వారి శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.