India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల, సవిత, సత్యకుమార్ యాదవ్ ముందు వరుసలో కూర్చుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అలాగే జిల్లాకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు జిల్లా ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకలకుంట వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికా రెడ్డి బంగారు పతకంతో మెరిశారు. బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో ఈ పతకాన్ని సాధించారు. తలుపుల మండలం గంజివారిపల్లెకు చెందిన గుణరంజన్ రెడ్డి కుమార్తె సోహన్వికా చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లికి చెందిన రెడ్డప్పరెడ్డి పొలంలో మామిడి చెట్లు నరికివేసిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై చిన్న రెడ్డప్ప తెలిపారు. గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు వెంకటస్వామి, నాగభూషణం, శ్రీనివాసులు, రాఘవేంద్ర, గోపాల్‌లు రెడ్డప్ప రెడ్డి పొలంలో 150 మామిడి చెట్లు నరికి వేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా కొమ్ము సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారని ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజకవర్గ కో ఇన్‌ఛార్జ్ పెద్ద పుల్లయ్య మాదిగ ఆదివారం పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్‌కు ఎమ్మార్పీఎస్ తాడిపత్రి టీం తరఫున శుభాకాంక్షలు తెలిపామన్నారు.

బొమ్మనహాళ్ మండలం శెట్టూరుకు చెందిన మనోజ్ రెడ్డి శనివారం ప్రేమ విఫలం కావడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆయన బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించిన అమ్మాయి ఇష్టం లేదని చెప్పడంతో మనోజ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని చిన్నారులు మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాలు..<<13666450>>గుమ్మగట్ట<<>>(M) ఎస్.హొసళ్లికి చెందిన మల్లికార్జున కుమారుడు అరుణతేజ, మల్లేశ్ కుమార్తే స్పందన.. వీరిద్దరూ అన్నదమ్ములు. చిన్నారులను రాయదుర్గం పాఠశాలకు మామ సురేశ్ బైక్‌పై తీసుకెళుతుండగా వేగంగా వచ్చి ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణతేజ అక్కడికక్కడే మృతిచెందగా, స్పందన ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

పుట్లూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పుట్లూరు మండలం ఏ. కొండాపురం గ్రామం వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై లారీ-కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన నీలకంఠాచారి మృతి చెందారు. అయితే గత ఎన్నికలలో తాడిపత్రి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలో టిడ్కో గృహాలు వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయో సమగ్ర నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోనే మినీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈనెల 11న పుట్టపర్తి సాయి ఆరామా సమావేశం మందిరంలో జిల్లా అభివృద్ధిపై పలు అంశాలపై ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాల సమగ్ర నివేదికలపై ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

అనంత జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జడ్పీ సీఈవో వైకోమ్ నిదియా దేవి, నగర పాలక కమిషనర్ మేఘా స్వరూప్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ గార్గ్‌ను రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్‌గా, వైకోమ్ నిదియా దేవిని రాజంపేట సబ్ కలెక్టర్‌గా, మేఘా స్వరూప్‌ను మదనపల్లి సబ్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. అయితే వీరి స్థానాల్లో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు.
Sorry, no posts matched your criteria.