India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వృద్ధురాలి గొంతుకోసి బంగారు, నగదు దోచ్చుకెళ్లిన ఘటన గురువారం వెలుగుచూసింది. స్థానికలు వివరాల ప్రకారం.. మడకశిర మండలం ఎల్కోటి గ్రామానికి చెందిన వడ్డే చంద్రక్క అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా చోరికి దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆమె గొంతుకోసి ఇంటి చెవిలో కమ్మలు, ఇంట్లో రూ.25వేలు చోరీ చేసి ఆమెను ఇంటి ఆవరణలో పడేశారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మనవరాళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులపై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతపురం రూరల్‌లోని ఓ గ్రామానికి చెందిన 7, 8 ఏళ్ల బాలికలను 63ఏళ్ల రంగనాయకులు ఇంట్లోకి పిలిపించి తన సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
గుంతకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన సూర్యనారాయణపై ఎస్సీ, ఎస్టీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ సురేశ్ బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాలు.. సూర్యనారాయణ ఓ మహిళను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. మంగళవారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత మహిళ, ఆమె భర్త బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ సూచించారు. బుధవారం జిల్లా జడ్జి ఛాంబర్‌లో జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎస్పీలు గౌతమి శాలి, మాధవరెడ్డిలతో సమావేశమయ్యారు. లోక్ అదాలత్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ అమరావతిలోని సచివాలయంలో ఛాంబర్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు రెండో బ్లాకులోని తొలి అంతస్తులో 212వ ఛాంబరు కేటాయించారు. ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టారు. వైద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఐదో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో 211వ ఛాంబర్ కేటాయించగా ఈ నెల 16న బాధ్యతలు చేపట్టారు. మంత్రి సవితకు నాలుగో బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో 131వ ఛాంబర్ కేటాయించారు.
విజయవాడ సచివాలయంలో బుధవారం శాసన సభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రికి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
యాడికి నుంచి 13కి.మీ దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య వెలసిన కోన రామలింగేశ్వరుడు ఆలయం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. ఆలయం ఎదుట కొండపై నుంచి దూకుతున్న కోన ఉప్పలపాడు జలపాతం దర్శనమిస్తుంది. దీంతో పాటు ఆలయం వెనుక ఎకరా విస్తీర్ణంలో విస్తరించిన వందల ఏళ్లనాటి మర్రి చెట్టు, ఆ పక్కనే చెరువు ఉండటంతో పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాట కేంద్రంగా అభివృద్ధి చేయాలనడంపై మీ కామెంట్.
కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని కన్నేపల్లి రోడ్డుపైకి మంగళవారం సాయంత్రం రెండు ఎలుగుబంట్లు రావడం చూసి అటుగా వెళుతున్న ప్రయాణికులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయంతో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని కోరారు.
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులు, ఏపీఐఐసీ, సోలార్ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్, ఎంఐజి లేఅవుట్, రైల్వే, సాంఘిక సంక్షేమ శాఖల భవనాలకు సంబంధించి భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను సత్యసాయి జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డితో పాటు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం సత్యసాయి జిల్లా పరిస్థితులపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.