India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరగనుంది. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని వైసీపీ ప్రకటన విడుదల చేసింది.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీశ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై 1,005 కేసులు నమోదు చేశామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై 42 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 09 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రూ.1,21,910ల జరిమానా విధించామని తెలిపారు.
మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్ట్ పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్ కుమార్‌ను గుంతకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియాలో బ్రాహ్మణిపై అనుచిత పోస్ట్ పెట్టాడంటూ ఇటీవల స్థానిక టీడీపీ నేత ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి యువకుడికి నోటీసులు ఇచ్చారు.
ధర్మవరం పట్టుచీరల డిజైనర్ నాగరాజు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరుపున న్యూ ఢిల్లీ నుంచి అరస్థి గుప్తా, జాస్మిన్ కౌర్ అను నిపుణుల కమిటీ పరిశీలన కోసం వచ్చారు. సత్యసాయి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టు పరిశోధన శాఖ ఎడీ రామకృష్ణ వారికి పట్టు గుళ్ల నుంచి పట్టు చీరల తయారీ వరకు అన్ని దశలలో వివరించారు. విషయాలు తెలుసుకున్న సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్‌పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం నగరంలోని పాత ఆర్టీవో కార్యాలయం కాంపౌండ్ పక్కన ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌లను తనిఖీ చేసి ఈవీఎం యంత్రాలను భద్రత చర్యలను క్షుణంగా పరిశీలన చేశామన్నారు. పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురం టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించింది. ఈ గ్రామంలోని ఓటర్లందరూ రూ.100 చెల్లించి ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వెంకటాపురంలో 581 ఓట్లు ఉండగా ఇటీవల 13 మంది మృతి చెందారు. మిగిలిన 568 మంది టీడీపీ సభ్యత్వం పొందారు. దీంతో గ్రామం మొత్తం పసుపుమయమైంది. ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం TDP సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలోని మంగాపురం వద్ద సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు ఒడిశాకు చెందిన యువతులుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నెల 26 నుంచి 30 రోజులపాటు సెల్ ఫోన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువకులు అర్హులన్నారు. 18-45 సంవత్సరాల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
టమాటా ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. నెల క్రితం కిలో రూ.100 పలకగా ప్రస్తుతం భారీగా పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.10 పలుకుతోంది. కనిష్ఠ ధర రూ.5 కావడం విశేషం. సరాసరి రూ.7తో విక్రయాలు సాగుతున్నాయి. తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
Sorry, no posts matched your criteria.