India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. అనంతపురం జిల్లాలోని 2,76,147 మంది రైతులకు రూ.55.23 కోట్లు, సత్యసాయి జిల్లాలోని 2,51,473 మంది రైతులకు రూ.50.29 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <
తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఆలయ గోపురాన్ని ఏపీ ప్రభుత్వం 10వ తరగతి పాఠ్యపుస్తకాలపై ముద్రించింది. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పెన్నానది ఒడ్డున వెలసింది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే శివలింగం మీద నేరుగా సూర్యకిరణాలు పడటం, ఆలయంలోని స్తంభాలను చేతులతో టచ్ చేస్తే సప్త స్వరాలు పలుకుతాయి.
మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్వి అనంతపురం ఎస్పీ గౌతమి షాలికి ఫిర్యాదు చేశారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగనే కారణమని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఈమేరకు జిల్లా ఎస్పీ గౌతమి షాలికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట జిల్లా టీడీపీ మహిళా నేతలు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో సత్యసాయి జిల్లాలోని అధికారుల పనితీరు స్ఫూర్తిదాయకమని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీచేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై కలెక్టర్ వివిధ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల సహకారంతో జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో సత్యసాయి జిల్లాలో 2524 మంది పరీక్షలు రాయగా 1557 మంది పాసయ్యారు. 62 % ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. అనంత జిల్లాలో 4811 మంది పరీక్షలు రాయగా 2920 మంది పాసయ్యారు. 61 % ఉత్తీర్ణతతో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కోర్సులో సత్యసాయి జిల్లాలో 310 మంది పరీక్ష రాయగా 183 మంది, అనంత జిల్లాలో 445 మంది పరీక్ష రాయగా 264 మంది పాసయ్యారు.
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ = ఎంపికైన విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం ఎంపికైన విద్యార్థులు స్కాలర్ షిప్ కొరకు బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయించుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో 9, 10, 11,12 తరగతులు చదువుతూ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో నమోదుచేసుకున్న విద్యార్థులు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు.
చీని కాయల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి మంగళవారం బోల్తా పడింది. లారీ తిమ్మంపేట నుంచి గార్లదిన్నెలోకి వస్తుండగా శింగనమల క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురానికి చెందిన ఆరోన్ రోనాల్డిన్ భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం దిలీప్ కుమార్ విజయవాడ రాష్ట్ర సాఫ్ట్ టెన్నీస్ కార్యాలయంలో తెలిపారు. జూన్ 18 నుంచి 23 వరకు కొరియాలోని ఇంచియాన్‌లో జరుగనున్న నొంగ్యుప్ బ్యాంక్ ఇంచియాన్ కొరియా కప్ పోటీలలో భారతజట్టుకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని పేర్కొన్నారు.
ఓబుళదేవరచెరువు మండలం చౌడంపల్లిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ వంశీకృష్ణ వివరాలు..యువతి ఇంట్లో తరచూ ఫోన్‌లో మాట్లాతుండగా తల్లిదండ్రులు దండించారు. దీంతో ఆమె ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. వెతికినా కనబడలేదన్నారు. సోమవారం గ్రామ సమీపంలోని చెక్‌డ్యాం వద్ద యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచన ఉందన్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.