Anantapur

News March 22, 2024

అనంత: జిల్లాలో 35,792మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం

image

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పలు కారణాలతో మంచానికి పరిమితమైన వారు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 85 ఏళ్ళు ఆపై వయసున్న వారు 9,799 మంది ఉన్నారు. అందులో పురుషులు 3,873 మహిళలు 5,926 మంది దివ్యాంగ ఓటర్లు 25,993మంది ఉన్నట్లు వెల్లడించారు.

News March 22, 2024

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి

image

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆయన 1996లో ఉమ్మడి అనంత జడ్పీ ఛైర్మన్‌గా, 1999లో హిందూపురం ఎంపీగా, 2009, 2014లలో వరసగా పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారయణ చేతిలో ఓడిపోయారు.

News March 22, 2024

అనంత: బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య

image

అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ యువతి ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు పట్టణం హనుమేశ్ నగర్ కు చెందిన నవ్య బీటెక్ CSE ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థిని హాస్టల్ గదిలో గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News March 22, 2024

అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా..?

image

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. హిందూపురం అభ్యర్థిగా బీకే పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

News March 22, 2024

ఎన్నికల సందర్భంగా లైసెన్స్ ఆయుధాల సేకరణ: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 703 లైసెన్స్ హోల్డర్లు ఉండగా, 654 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించామని ఎస్పీ అన్బురాజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ ఎన్నికలు ప్రక్రియ ముగిసే వరకు ఆయుధాలు పోలీస్ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు.

News March 22, 2024

అనంతపురం జిల్లాకు 23న ప్రవీణ్ ప్రకాశ్ రాక..!

image

అనంతపురం జిల్లాలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యా ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఈ నెల 23వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపించారు. జిల్లాలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై ఆయన అక్కడికక్కడే చర్యలు తీసుకొంటామన్నారు.

News March 21, 2024

అనధికార ఆయుధాలు గుర్తిస్తే పిర్యాదు చెయ్యండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లాలో అనధికారికంగా ఆయుధాలు వున్నట్లు తెలిస్తే 9440796800 లేదా పోలీసు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392918293 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అన్బురాజన్ కోరారు.
జిల్లాలో 703 మంది వద్ద 734 ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 654 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. 77 ఆయుధాలు బ్యాంక్ సెక్యూరిటీ దగ్గర ఉన్నాయన్నారు.3 మాత్రంమే డిపాజిట్ చేయాల్సి ఉందని వెల్లడించారు.

News March 21, 2024

తాడిపత్రిలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

image

తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2024

ధర్మవరంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

image

ధర్మవరం పట్టణం ఇందిరానగర్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు గురువారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పి వంశీకృష్ణను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. వంశీకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2024

ఎన్నికలవేళ… జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు..

image

సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు.