India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడిపత్రిలో దారుణ హత్య జరిగింది. తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన లాల్‌స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి హత మార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీంకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 21న రష్యాలో వివిధ దేశాల మేయర్లతో జరిగే సదస్సుకు అనంతపురం మేయర్‌కు ఆహ్వానం అందింది. బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు 50 మందికి పైగా మేయర్లు హాజరవుతారు. ఏపీ నుంచి కేవలం అనంతపురం మేయర్‌కు మాత్రమే ఆహ్వానం రావడం విశేషం.
అనంతపురానికి చెందిన జాహ్నవి విజయవాడ శివారు గూడవల్లిలో గుండెపోటుతో మృతిచెందింది. ఈ మేరకు పటమట సీఐ మోహన్ రెడ్డి వెల్లడించారు. జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వెళ్లింది. శనివారం అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు.. జాహ్నవి గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో హిట్ మ్యాన్ అండ్ ప్రోమోస్ ప్రొడక్షన్ సినిమా యూనిట్ సందడి చేసింది. గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కన ఎంపిక చేసిన రైతు ఇంట్లో ఆదివారం షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ‘ఇంద్రప్రస్థా’ పేరుతో నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, చైతన్య కృష్ణ హీరోలుగా నటిస్తున్నారు.
మత సామరస్యానికి ప్రతిగా నిలిచే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, మదర్సాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పామిడికి చెందిన నితిన్(20) 4 రోజుల క్రితం పెయింటింగ్ పని చేస్తూ మూడంతస్తుల భవనం నుంచి కిందపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే తాను చనిపోయాక అవయవాలను దానం చేయాలని, ఇదే చివరి కోరిక అని తల్లికి చెప్పి చనిపోయాడు. తన కొడుకు కోరిక మేరకు నితిన్ అవయవాలను శనివారం దానం చేశారు.
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని పాతకోటకు చెందిన దాదాపీర్.. అనుమానంతో భార్య రమీజాను అర్ధరాత్రి కత్తితో గొంతు కోశాడు. ఆమెను స్థానికులు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరికి వివాహం జరిగి కేవలం 5 నెలలు అయినట్లు తెలుస్తోంది.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు ఫార్మా-డీ 5వ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2024ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉన్న ప్రశ్న పత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. జూన్ 16వ తేదీన 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన బాలుడు శనివారం అదృశ్యమయ్యాడు. బాలుడు విహాన్ రాజు ఇంటి బయట ఆడుతూ ఉండగా కొద్దిసేపటికి చూసేలోపే అదృశ్యం అయ్యాడని తల్లిదండ్రులు హరి ప్రసాద్, రామలక్ష్మి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించాలని పోలీసులు తెలిపారు .
Sorry, no posts matched your criteria.