India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఎంఫార్మసీ మూడో సెమిస్టర్, ఫార్మాడీ ఒకటి, రెండు, మూడో సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశామన్నారు.
ఎద్దుల బండిని కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. హిందూపురం వైపు నుంచి కొట్నూరు వెళుతున్న ఎద్దుల బండిని కారు ఢీకొని ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
జిల్లాలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. తదనుగుణoగా ఇతర రాష్ట్రాల నుండీ లిక్కర్, డబ్బు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు జిల్లాలోకి రాకుండా కర్నాటక సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్ పోస్టులో నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలియజేశారు.
ఎన్నికల సంసిద్ధతపై సత్యసాయి కలెక్టర్ కార్యాలయ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్ఓ కొండయ్య తదితరులతో ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని జల్లిపల్లి గ్రామానికి చెందిన పవన్ (22)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపిక తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రకు జిల్లా వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన షేక్ జిలాన్ బాషాకు అనంతపురంలో యాక్సెస్ బ్యాంకు అకౌంట్ ఉంది. శనివారం రాత్రి ఖాతా నుంచి రూ.1,73,100 దొంగలించినట్లు బాధితుడు వాపోయాడు. దీనిపై సైబర్ క్రైమ్ నంబర్ 1030తోపాటు గార్లదిన్నె పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ లింకు పంపించి క్లిక్ చేయగానే ఫోను హ్యాక్ చేసి దొంగలించినట్లు పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంటుకు కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.
Sorry, no posts matched your criteria.