India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఐదేళ్లలో పేదల ఇళ్ల మాటున కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలను బయటకు తీస్తామని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలో నిధులు ఉండి పనులు చేయని రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గుమ్మగట్ట మండలం కృష్ణాపురానికి చెందిన మంజునాథ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని హనుమంతపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం బైక్‌పై కౌండపల్లికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
పెనుకొండ ఎమ్మెల్యేకు మరోసారి బీసీ సంక్షేమశాఖ దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన శంకరనారాయణ ఈ శాఖతో పాటు రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా.. ఈసారి కూడా తొలిసారి గెలుపొందిన సవితకు ఇదే బీసీ సంక్షేమశాఖ దక్కడం గమనార్హం. కాగా వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు <<13439231>>మంత్రులు<<>> ఉండగా ఈసారి ముగ్గురు ఉండటం విశేషం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ప్రణాళిక, వాణిజ్య పన్నులు&అసెంబ్లీ వ్యవహారాలు, ధర్మవరం ఎమ్మెల్యే వై.సత్యకుమార్ యాదవ్‌కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య, పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చేనేత, బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా ఈ ముగ్గురూ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి.
యూట్యూబ్‌లో వీడియోలను చూసి వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరి సూచించారు. యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేసినట్లు వ్యవసాయాన్ని క్రియేట్ చేయలేమన్నారు. ప్రతి రైతూ అధికారుల సూచనలు, సలహాలు పాటించి పంటలను సంరక్షించుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
గాండ్లపెంట మండలం కల్లుబావి తండాకు సమీపంలలో YCP నాయకుడు రామాంజులు గెస్ట్‌హౌస్ నిర్మించుకొని పంచాయతీ బోరు నుంచి పైపులైన్ వేసుకున్నాడని, దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపించారు. ఆ పైపులైన్‌ను తొలగించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ బోరు నుంచి ఎంపీటీసీ నిధులతో గెస్ట్‌హౌస్‌కు పైపులైన్ వేసుకొని తోటకు నీరు వాడుకుంటున్నట్లు తెలిపారు.
హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని రోల్‌వెల్ పరిశ్రమలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. కొటిపి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(44) రోల్‌వెల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం విధులకు వెళ్లి మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా? లేక ప్రమాదం ఏమైనా సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
4 నెలల చిన్నారి క్రిస్టినా సియారా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆంగ్ల అక్షరాలు, జంతువులు, పండ్లు, పక్షులు.. వంటి వాటిని గుర్తించడంలో ప్రతిభ చూపి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. గుంతకల్లు మోదీనాబాద్‌లో ఉండే రైల్వే ఉద్యోగి సుధాకర్, సింధు దంపతులు గురువారం కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిశారు. కలెక్టర్ సమక్షంలో మెడల్, ప్రశంసా పత్రాన్ని ప్రదర్శించారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఢిల్లీ కేంద్రంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు.
గుత్తికి చెందిన వ్యాపారస్థుడు శ్రీరామ్ సత్య ఆంజనేయులు(65) కేదార్నాథ్‌లో మృతి చెందాడు. గత నెల 25వ తేదీ సుమారు 40మంది కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి గంగోత్రిలో ఉన్న సమయంలో శ్రీరాం సత్య ఆంజనేయులుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో టూరిస్టులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Sorry, no posts matched your criteria.