India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నార్పల మండలం పప్పూరు గ్రామంలోని అరటి తోటలో మృతదేహం లభ్యమైంది. మృతుడు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రాంమోహన్ రెడ్డిగా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నార్పల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే అప్పులు బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది
39 ఏళ్ల తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. ధర్మవరం అసెంబ్లీ ఏర్పడిన తరువాత ఇద్దరిని మాత్రమే మంత్రి పదవి వరించింది. మూడో వ్యక్తి సత్యకుమార్ యాదవ్. కాంగ్రెస్ నుంచి పీవీ చౌదరి మంత్రిగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985లో నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి 4 దశాబ్దాల పాటు ధర్మవరాన్ని మంత్రి పదవి ఊరిస్తూ వచ్చింది. తాజాగా సత్యకుమార్ యాదవ్‌కు దక్కింది.
ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్/పార్టమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.
వెంకటగిరిలో జరిగిన సౌత్ జోన్ వన్ డే బాలికల క్రికెట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అనంతపురం జిల్లా అండర్-19 బాలికల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. అనంతపురం జట్టు 14 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ ఛాంపియన్‌గా నిలిచిన అనంతపురం జట్టును జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి, కోచ్ ఆర్.కుమార్ అభినందించారు.
ఉరవకొండ నియోజకవర్గానికి 39 ఏళ్ల తర్వాత మంత్రి పదవి దక్కింది. ఇక్కడి నుంచి గెలిచిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యారు. ఆ తరువాత ఎవరినీ అదృష్టం వరించలేదు. ఇన్నేళ్ల తరువాత టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. 1994లో కేశవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మరో 4సార్లు గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఆయన పోటీ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు 5,127 పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం తెరుచుకోనున్నాయి. అందులో ప్రభుత్వానివి 3,855 పాఠశాలలు కాగా, ప్రైవేట్ పాఠశాలలు 1,272 ఉన్నాయి. మొత్తం 5.88 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యార్థులకు అందాల్సిన విద్యా కానుక కిట్లు మాత్రం పూర్తిస్థాయిలో రాలేదని అధికారులు చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, దూరదృష్టి లోపంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. యాడికి మండలం పెద్దపేట గుండా వెళ్లే రాష్ట్రీయ రహదారి వానొస్తే చాలు వాగులా మారుతోంది. పెద్దపేట ఎస్సీ కాలనీ వద్ద రహదారి మడుగులా మారుతోందని, వాహనాల రాకపోకలకు, చోదకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రెండేళ్లుగా ఈ దుస్థితి ఇలాగే కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటి చేసి సవిత ఘన విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ తరుపున పోటీ చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఉషా శ్రీ చరణ్‌ను ఓడించి అత్యధిక మెజారిటితో గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు, ఘనంగా సన్మానించారు.
తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం జలమయమైంది. పట్టణంలోని విద్యార్థులకు, క్రీడాకారులకు ఇదొక్కటే క్రీడా మైదానం. చిన్నపాటి వర్షాలకే మడుగులా మారుతోంది. విద్యార్థులు ఆటలకు దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డైలీ వాకర్స్ సైతం నీరు నిలిచి ఉండడంతో వాకింగ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతపురం నుంచి హైదరాబాద్, బెంగళూరులకు వోల్వో బస్సులను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలను పంపించాలన్నారు.
Sorry, no posts matched your criteria.