India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈఏపీసెట్‌లో ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఔషధ విభాగంలో తలుపుల మండలానికి చెందిన దివ్యతేజ 2వ ర్యాంకు, అనంతపురం గణేశ్ నగర్‌కు చెందిన భాను తేజసాయి 6వ, ఇంజినీరింగ్ విభాగంలో సతీశ్ రెడ్డి 4వ, కుశాల్ కుమార్ 8వ, యాడికికి చెందిన సాయిజశ్వంత్ రెడ్డి 61వ ర్యాంక్ సాధించారు. తాడిపత్రికి చెందిన సాయి హనీశ్ రెడ్డి 28వ, పెద్దవడుగూరు మండలం తెలికికి చెందిన అనీషా 187వ ర్యాంకు సాధించారు.
పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ‘సవిత అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ మొదలు పెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. కాగా.. ఈమెకు మంత్రి పదవి రావడం తొలిసారి.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పయ్యావుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ‘పయ్యావుల కేశవ్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత ర్యాగ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ మొదలు పెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. కాగా పయ్యావులకు మంత్రి పదవి రావడం తొలిసారి.
ఊహించని విధంగా ధర్మవరం సీటు సాధించి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించారనే చెప్పవచ్చు. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మందికి అవకాశం దక్కగా.. బీజేపీకి కేటాయించిన ఆ ఒక్కరూ ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ కావడం విశేషం. ఈ నియోజవర్గానికి వచ్చిన కేవలం 40 రోజుల్లోనే తన రాజకీయ మార్కును సత్య చూపించారనడం అతిశయోక్తి కాదు. ‘కంగ్రాట్స్ సత్యకుమార్ యాదవ్’
అనంతపురం జిల్లాలోని ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల వేసవి సెలవులను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం (జీసీటీఏ) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీసీటీఏ నాయకులు శ్రీధర్, జయప్ప, రంగనాథ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ పొగాకు రామచంద్ర రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతో 2023లో ఛైర్మన్‌గా రామచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో కార్పొరేషన్ల కో-ఆర్డినేటర్ పులివెందుల ప్రవీణ్ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన ఎంసీఏ నాలుగో సెమిస్టర్ (R-20) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మొత్తం 98% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వెల్లడించారు. తక్కువ సమయంలోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డీ.విష్ణువర్ధన్‌ను అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలు పునఃప్రారంభించాల్సిన ఉండగా ఒకరోజు సెలవు పొడిగించినట్లు సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి తెలిపారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థల వారు ఈనెల 12వ తేదీన కాకుండా 13వ తేదీన విద్యాసంస్థలను ప్రారంభించాలని ఆదేశించారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమంగా ఒకరోజు అదనపు సెలవును ప్రకటించారు.
పెనుకొండ MLA సవితకు తొలిసారి కేబినెట్‌లో స్థానం దక్కింది. ఈమె వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌పై గెలుపొందారు. ఈమె 1977 జనవరి 15న పెనుకొండ మండలం రామపురంలో జన్మించారు. తండ్రి ఎస్.రామచంద్రరెడ్డి. 1998లో అనంతపురం శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె.. 2018లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారి తొలిసారి గెలుపొందారు.
ఉమ్మడి అనంత జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవులు వరించాయి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవితకు కేబినెట్‌లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ఆ ఒక్కరూ మన ధర్మవరం ఎమ్మెల్యే కావడం విశేషం. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Sorry, no posts matched your criteria.