India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రసారం సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని మున్సిపాలిటీలలోని ప్రధాన కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు. దీనిని తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లు, టీవీ సెట్లను ఏర్పాటు చేశామన్నారు.
విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న జిలాన్ బాషా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఉదయం కనేకల్లు మండలంలోని మాల్యం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఛాతి నొప్పితో సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయనని కనేకల్లు క్రాస్ వద్ద ఉన్న ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.
ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మద్యాహ్నం గ్రామానికి చెందిన బూదగవి రామలింగ అనే వ్యక్తి స్థానికి సత్యసాయి పంపుహౌస్ వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా పైనుంచి ఎండిన చెట్టు కొమ్మ విరిగి మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
పెనుకొండ పట్టణంలో ఎమ్మెల్యే సవిత ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ను బుధవారం నుంచి తిరిగి ప్రారంభం చేయనున్నట్లు మంగళవారం సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వల్ల అన్న క్యాంటీన్ నిర్వహణ సాధ్యం కాలేదని ఆమె తెలిపారు. జూన్ 12 బుధవారం నుంచి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌ను సవిత తిరిగి ప్రారంభిస్తున్నారు. అన్న క్యాంటీన్ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉడేగోళానికి చెందిన పదో తరగతి చదువుతున్న చరణ్‌ను రెండు నెలల కిందట రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద ఉన్న హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 15న శనివారం నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అనీల్‌కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, పదోతరగతి మార్కుల జాబితా, జనన ద్రువీకరణ పత్రం, క్రీడా సామగ్రి, యూనిఫాంతో హాజరుకావాలన్నారు. ఎంపికైన జట్టు ఈ నెల 27 నుంచి ధర్మవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
తాడిపత్రిలో ఎన్నికల నేపథ్యంలో మే 13, 14వ తేదీల్లో జరిగిన అల్లర్లపై సిట్ ఎన్నికల సంఘానికి ఈనెల 1న తుది నివేదిక అందజేసింది. అల్లర్లపై మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్, జూనియర్ కళాశాల మైదానం, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద జరిగిన దాడులు, ఏయే కేసుల్లో ఎంత మందిని నిందితులుగా గుర్తించారు? లాంటి వివరాలతో మొత్తం 370 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
అనంతపురంలోని స్థానిక ఏరా ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 16న ఉదయం 9 గంటలకు జిల్లా ఆర్చరీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్ తెలిపారు. అండర్-10, 13, 15 విభాగాల్లో మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న జిల్లా క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికైన వారు విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో గత నెలలో నిర్వహించిన MCA, MBA పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. MCA 3, 4వ సెమిస్టర్, MBA మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ జిల్లా మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి కోరారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జనచైతన్య నగర్ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అప్పుడే శ్రావణికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు
Sorry, no posts matched your criteria.